సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు | Supreme Court setback for Raghurama Krishna Raju | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురు

Oct 26 2026 12:17 PM | Updated on Oct 26 2026 1:03 PM

Supreme Court setback for Raghurama Krishna Raju

సాక్షి,న్యూఢిల్లీ : బ్యాంకు కుంభకోణం కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహా ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ డైరెక్టర్లకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన క్వాష్ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంకులకు సుమారు రూ. 237 కోట్ల మేర మోసం చేయడం, నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ ఈ దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తు ప్రక్రియలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

16 వారాల్లో చార్జిషీట్ దాఖలు 
ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు.. రాబోయే 16 వారాల్లోగా ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రఘురామకృష్ణరాజుతో పాటు ఇండ్ భారత్ పవర్ డైరెక్టర్లకు చట్టపరంగా ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

ఇదీ చదవండి : సుప్రీం కోర్టులో రఘురామకృష్ణరాజుకు బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement