రెండేళ్ల పిడుగు.. తబలాతో ఆడేసుకుంది! | 2-year-old tabla prodigy from Karnataka breaks the record for reciting and playing 12 taals | Sakshi
Sakshi News home page

రెండేళ్ల పిడుగు.. తబలాతో ఆడేసుకుంది!

Oct 27 2026 6:08 AM | Updated on Oct 27 2026 6:08 AM

2-year-old tabla prodigy from Karnataka breaks the record for reciting and playing 12 taals

కర్ణాటక చిన్నారికి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు

హొన్నావర్‌: కర్ణాటకకు చెందిన ఓ చిచ్చరపిడుగు కేవలం రెండేళ్ల వయస్సుల్లోనే తన ప్రతిభను చాటింది. తబలాపై 12 తాళాలను వాయించి చూపడంతోపాటు వాటిని ఏమాత్రం ఉచ్ఛారణ బేధం లేకుండా పలికి చూపించింది. ఈమె ప్రతిభను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించి, నమోదు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా హొన్నావర్‌కు చెందిన ప్రముఖ తబలా విద్వాంసుడు గురురాజ్‌ హెగ్గే, హిందూస్తానీ విద్వాంసురాలు, ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ అయిన శ్రీలత దంపతుల కుమార్తె స్వరశ్రీ హెగ్డే. ఈ చిన్నారి వయస్సు కేవలం రెండేళ్ల పది నెలలు.

 నెలల శిశువుగా ఉన్నప్పటి నుంచే హన్నావర్‌లో ఉన్న సంగీత పాఠశాలలో తండ్రి పక్కనే ఉంటూ విద్యార్థులకు బోధించే పాఠాలను గమనించేది. దీనికితోడు తండ్రి ఇచ్చిన తరీ్ఫదుతో ఆమె సంగీత పాఠాల్ని అవపోసన పట్టింది. ఇప్పుడామె 12 తాళాలు, వాటికి అనుబంధంగా ఉండే బోల్‌లను సునాయాసంగా చెప్పగలదు..తబలాపై వాయించి చూపగలదు. స్వరశ్రీ ప్రతిభను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు గుర్తించి, ఆమెకు చోటుకల్పించారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు గురురాజ్, శ్రీలత హర్షం వ్యక్తం చేశారు. స్వరశ్రీ తడబడకుండా తబలా వాయిస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఏకాగ్రతతో ఆమె తబలా వాయిస్తుండటం చూసి అంతా ఔరా అని ఆశ్చర్యపోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement