తోడబుట్టిన సోదరి లేదని.. | No sister of his own UP man becomes brother to 101 Hindu and Muslim brides | Sakshi
Sakshi News home page

తోడబుట్టిన సోదరి లేదని..

Oct 27 2026 6:03 AM | Updated on Oct 27 2026 6:03 AM

No sister of his own UP man becomes brother to 101 Hindu and Muslim brides

101 మంది యువతులకు అన్నగా 

సామూహిక వివాహాలు జరిపించిన యూపీ వ్యక్తి

షాజహాన్‌పూర్‌: తోడబుట్టిన అక్కాచెల్లెళ్లు లేరు. ఆ లోటును పూరించడానికి 101 మంది యువతులకు అన్నగా మారారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్‌ అగర్వాల్‌. దగ్గరుండి వారందరికీ సామూహిక వివాహాలు జరిపించారు. అంతేకాదు.. ఉత్తి పెళ్లి చేసి చేతులు దులుపుకోలేదు.. పెట్టిపోతలు, చీరసారెలు అన్నీ పెట్టి ఘనంగా వేడుక నిర్వహించారు. యూపీలోని షాజహాన్‌పూర్‌కు చెందిన వినయ్‌ అగర్వాల్‌ వ్యాపారవేత్త. ఆయనకు తోడబుట్టిన సోదరి లేదు. ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలు ఎన్నో. వారికి అన్నగా మారాలనుకున్నాడు. 

తనకు తెలిసిన, తన దగ్గర పనిచేసేవారి పిల్లల పెళ్లిళ్లకు వెళ్లి సాయం చేయడం 2018 నుంచే మొదలుపెట్టారు. అయితే, వివాహ బాధ్యతలు పూర్తిగా తీసుకుంటే బాగుంటుందని తల్లి సరోజ్‌ అగర్వాల్‌ సూచించింది. ఆమె సలహాతో 2023లో 11 మంది యువతులకు పెద్దన్నగా మారి, వివాహం జరిపించారు. ఆ తర్వాతి ఏడాది 21 మందికి, ఆ తర్వాత 51 మందికి వివాహాలు నిర్వహించారు. ఈ ఏడాది ఏకంగా 101 మంది యువతులకు అన్నగా మారా రు. దివంగత తండ్రి అశోక్‌ అగర్వాల్‌ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ వేడుకను నిర్వహిస్తారు. పెళ్లి వేడుక నిర్వహించడమే కాదు.. వారు కొత్త జీవితాన్ని ప్రార ంభించడానికి అవసరమయ్యే వస్తువులను కూడా అందించారు. ఈ వేడుకల్లో ఆయనకు కుటుంబం అండగా నిలిచింది.

కుటుంబ సభ్యులందరూ కలిసి వివాహ ఏర్పాట్లను, ఆచారాలను పూర్తి చేశారు. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకలో 93 హిందూ జంటలు వైదిక సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోగా, ఎనిమిది ముస్లిం జంటలు మత పెద్దల సమక్షంలో ‘నికాహ్‌’ద్వారా ఒక్కటయ్యాయి. కుటుంబాలన్నీ కలిసి పండుగ వాతావరణంలో ఈ వివాహ వేడుకలను జరుపుకోన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement