సాక్షి,న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే ఆమోదించామని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంపై వచ్చిన వార్తా కథనాల ఆధారంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ అఫిడవిట్ సమర్పించింది.
ఎస్‌ఐఆర్‌కు సంబంధించి 2025 జూన్, అక్టోబర్, 2026 మే నెలల్లో జారీ చేసిన మూడు ఉత్తర్వులూ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని ఈసీఐ స్పష్టం చేసింది. కమిషనర్లు, అధికారుల అభిప్రాయాలను, సూచనలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకుంటామని వివరించింది.
అంతేకాదు కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో ఎలాంటి మార్పులు చేయలేదని కూడా స్పష్టం చేసింది. అయితే ఎస్‌ఐఆర్ నిర్ణయాలపై ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అఫిడవిట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా ఈ వ్యవహారంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, అసదుద్దీన్ ఒవైసీ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు అక్టోబర్ 27న విచారించనుంది. ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టవిరుద్ధమని తేలితే వాటిని రద్దు చేస్తామని గతంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.


