ఓసీఐ కార్డుపై ఇమ్రాన్ ఖాన్ పోరాటం | Imran Khan battle over OCI card says he Residing in India for 42 years | Sakshi
Sakshi News home page

ఓసీఐ కార్డుపై ఇమ్రాన్ ఖాన్ పోరాటం

Oct 29 2026 5:08 PM | Updated on Oct 29 2026 5:29 PM

Imran Khan battle over OCI card says he Residing in India for 42 years

ముంబై: తన ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డును రద్దు చేసే అంశానికి సంబంధించి అధికారులు తనకు ఆధారాలను వెల్లడించాలని నటుడు ఇమ్రాన్ ఖాన్ కోరారు. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన “leave India notice”ను ఆయన బాంబే హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ నోటీసుపై నవంబర్‌ 2 వరకు హైకోర్టు స్టే విధించింది.

కాగా అక్టోబర్‌ 17న జారీ చేసిన షోకాజ్‌ నోటీసులో ముంబై పోలీసులు సమర్పించిన పత్రాలు, నివేదికలను ప్రస్తావించారని ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు. అయితే వాటిని తనకు అందించలేదని, అసలు తన వాదన వినకుండానే చర్యలు తీసుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఆధారాలను పరిశీలించి తనకు సమాధానం ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

తాను గత 42 ఏళ్లుగా భారత్‌లోనే నివసిస్తున్నానని, తన కుటుంబంతో పాటు, తన జీవితం కూడా ఇక్కడే ఉన్నాయని ఆయన వివరించారు. అంతేకాదు అధికారుల విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

నిరసనల నేపథ్యంలో నోటీసు
అక్టోబర్‌ 10న ముంబైలోని ఆగస్టు క్రాంతి మైదాన్‌ సమీపంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ జరిగిన నిరసన నేపథ్యంలో ఇమ్రాన్‌పై ఈ నోటీసు జారీ అయింది. నిరసనలో పాల్గొన్నారనే ఆరోపణలను ఇమ్రాన్‌ ఖాన్‌ ఖండించారు. ఆ రోజు తాను అక్కడికి చేరుకునే సమయానికి నిరసన జరగలేదని, పోలీసుల బారికేడ్లను కూడా తాను దాటలేదని ఆయన చెప్పారు.

భారత్‌ విడిచి వెళ్లాలంటూ అక్టోబర్‌ 28 వరకు గడువు విధించినప్పటికీ, బాంబే హైకోర్టు నవంబర్‌ 2 వరకు ఆ నోటీసును నిలిపివేసింది. అప్పటివరకు ఆయనను భారత్‌ విడిచి వెళ్లాలని అడగమని అధికారులు కోర్టుకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌లో హోరాహోరీ పోరు.. అరబ్ పార్టీలపై నెతన్యాహు సంచలన ఆరోపణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement