ప్రేమించాడని చింతచెట్టుకు కట్టేసి కొట్టి, హత్య | Man Tied To Tree Beaten To Death Over Love Affair In Gujarat | Sakshi
Sakshi News home page

ప్రేమించాడని చింతచెట్టుకు కట్టేసి కొట్టి, హత్య

Oct 29 2026 3:42 PM | Updated on Oct 29 2026 3:55 PM

Man Tied To Tree Beaten To Death Over Love Affair In Gujarat

గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖేరాలు తాలూకాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన పాపానికి 31 ఏళ్ల వ్యక్తిని  అమ్మాయి తరపు కుటుంబ సభ్యులే చింతచెట్టుకు కట్టేసి కొట్టి చంపిన వైనం దిగ్భ్రాంతి రేపింది.

పోలీసుల సమాచారంప్రకారం సిద్ధపూర్ తాలూకాలోని వాఘరోల్ గ్రామానికి చెందిన రంజీత్‌జీ చతుర్‌జీ ఠాకూర్ (31) సిద్ధపూర్‌లోని 'చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ'లో క్రెడిట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తంగానా గ్రామానికి చెందిన జగాజీ రాంచోడ్‌జీ ఠాకూర్ కుమార్తెతో రంజీత్‌జీకి గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉంది. వీరి ప్రేమ విషయం కుటుంబానికి తెలియడంతో వారు దారుణానికి తెగబడ్డారు.

ఏం జరిగింది?
మంగళవారం పని నిమిత్తం మోటార్ సైకిల్‌పై బయటకు వెళ్లిన రంజీత్‌జీ, ఆ రాత్రి ప్రియురాలిని కలవడానికి తంగానా గ్రామానికి వెళ్లారు.  ఈ సందర్భంగా అమ్మాయి  కుటుంబ సభ్యులు వారిని బంధించారు. బుధవారం ఉదయం రంజీత్‌జీ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో, రంజీత్‌ తండ్రి చతుర్‌జీ బాద్‌సంగ్‌జీ ఠాకూర్, బాబాయి, ఇతర బంధువులు తంగానా గ్రామానికి చేరుకున్నారు. కానీ అప్పటికే రంజీత్‌ శవంగా మారిపోయాడు. అక్కడున్న చింతచెట్టు కింద ఒక ఇనుప మంచంపై  గొనె సంచితో కప్పి  ఉన్న మృతదేహాన్ని గమనించారు. అతడి డెడ్‌ బాడీని పరిశీలించగా వీపు, మెడ, మోకాళ్లు సహా శరీర భాగాలపై తీవ్ర గాయాలు, నల్లటి దెబ్బలు కనిపించాయి. 

చెట్టంత ఎదిగిన కొడుకుని చింతచెట్టుకు కట్టేసి, కర్రలతో అమానుషంగా కొట్టారని, తీవ్ర గాయాలతో రంజీత్‌ అక్కడికక్కడే మరణించాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత మృతదేహాన్ని మంచంపై వదిలేసి, ఆ యువతిని తీసుకుని వెళ్లిపోయారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నెక్ట్స్‌ లెవల్‌ : దోసె, ఫిల్టర్‌ కాఫీకి జర్మన్‌ యువకుడు ఫిదా!

బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఖేరాలు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు నలుగురు నిందితుల, హంసాబెన్ జగాజీ ఠాకూర్ (యువతి తల్లి), హితేష్‌జీ జగాజీ ఠాకూర్ (యువతి సోదరుడు), భీమాజీ రాంచోడ్‌జీ ఠాకూర్ (యువతి బాబాయి), రామాజీ కేషాజీ ఠాకూర్ (సాక్రి గ్రామానికి చెందిన వ్యక్తి) కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టమ్‌ నివేదిక తరువాత తదుపరి చట్టపరమైన చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. 

ఇదీ చదవండి: రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement