నాన్నా.. 'పిల్లలను పెంచడం నాతో కావడంలేదు! నేను చనిపోతున్నా! | Mother Two Daughters Died Incident Manjeera River Telangana | Sakshi
Sakshi News home page

నాన్నా.. 'పిల్లలను పెంచడం నాతో కావడంలేదు! నేను చనిపోతున్నా!

Oct 29 2026 9:52 AM | Updated on Oct 29 2026 9:52 AM

Mother Two Daughters Died Incident Manjeera River Telangana

తల్లి ఆత్మహత్య

మెదక్‌ జిల్లాలో ఘటన..

తెలంగాణ, కొల్చారం (నర్సాపూర్‌): ఇద్దరూ ఆడపిల్లలు.. భర్త గుండెపోటుతో మరణం.. బతుకు పోరాటంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ తల్లి తన పిల్లలను నదిలోకి తోసేసి, తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ మొహినుద్దీన్‌ తెలిపిన వివరాలు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన గంగుల బాలకృష్ణయ్య కుమార్తె సరిత (27) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

ఇద్దరు ఆడపిల్లలు వైష్ణవి (7), శాన్విక (6) పుట్టిన ఏడేళ్లకే సరిత భర్త గుండెపోటుతో మరణించాడు. దీంతో సరిత ఇద్దరు పిల్లలను తల్లిదండ్రుల వద్దే ఉంచి హైదరాబాద్‌ వెళ్లి పనులు చేసుకుంటూ పిల్లలను చదివిస్తోంది. ఈనెల 26వ తేదీన హైదరాబాదు నుంచి స్వగ్రామానికి చేరుకుంది. 27నాడు ఉదయం ఏడుపాయల దేవాలయానికి వెళ్తానంటూ ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. దర్శనం అనంతరం తండ్రికి ఫోన్‌ చేసి.. ఆర్థిక పరిస్థితి భారంగా ఉందని, ఇద్దరు ఆడపిల్లలను పెంచడం తనతో కావడం లేదంటూ ఆవేదన చెందింది. అనంతరం మంజీరా నదిలో దూకి చనిపోతున్నట్లు చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది.

కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో మెదక్‌ రూరల్‌ సీఐ కృష్ణమూర్తి, ఎస్‌ఐ సిబ్బందితో కలిసి నది వెంట గాలించినా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం మెదక్‌ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్‌ శివారులోని మొదటి బ్రిడ్జి సమీపంలో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇదీ చదవండి: ఏడీఏలో సీనియర్ శాస్త్రవేత్త ఆత్మహత్య కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement