బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA)లో పనిచేస్తున్న 47 ఏళ్ల సీనియర్ శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పని ఒత్తిడి కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నట్టుకుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ప్రొగ్రామింగ్ విభాగంలో లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) ప్రొగ్రామ్‌లో పనిచేస్తున్న శరద్ కటియార్ అనే సీనియర్ శాస్త్రవేత్త, బెంగళూరులోని సీగేహళ్లిలో ఉన్న తన అపార్ట్‌మెంట్ 4-5వ అంతస్తుల మధ్య ఉన్న కిటికీ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలు
పని ఒత్తిడి , మానసిక ఆందోళనల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని శరద్ కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెల రోజులుగా తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న శరద్, డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారని వారు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్ స్పెషాల్టీ ఇదే!
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు శరద్‌పై ఎటువంటి పని ఒత్తిడి లేదని, ఆయన ఈ విషయమై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని ADA హెచ్‌ఆర్ డైరెక్టర్ కృష్ణ రాజేంద్ర వివరణ ఇచ్చారు. ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కేవలం పని ఒత్తిడి వల్లే ఇది జరిగిందని భావించలేమన్నారు.
ఇదీ చదవండి:జిమ్ ట్రైనర్‌తో లవ్.. భర్తపై హత్యాయత్నం : కట్ చేస్తే..!


