మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి షాక్‌! | A shock for the BJP in Modis own constituency | Sakshi
Sakshi News home page

మోదీ సొంత నియోజకవర్గంలో బీజేపీకి షాక్‌!

Oct 28 2026 1:34 PM | Updated on Oct 28 2026 1:37 PM

A shock for the BJP in Modis own constituency

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ ఓటమి పాలైంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని 11 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాలను గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు స్థానాల్లో విజయం సాధించింది.

ఉత్తరప్రదేశ్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని మొత్తం 28 ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌ 23న ఈ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. బహుళ అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటింగ్‌ నిర్వహించారు. అక్టోబర్‌ 27న ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో ఐదు గ్రాడ్యుయేట్‌, ఆరు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. లక్నో, వారణాసి, ఆగ్రా, మీరట్‌, అలహాబాద్‌-ఝాన్సీ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గాలతో పాటు లక్నో, వారణాసి, ఆగ్రా, మీరట్‌, బరేలీ-మొరాదాబాద్‌, గోరఖ్‌పూర్‌-ఫైజాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement