లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఒక భర్త అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. బాధితుడి భార్య, ఆమె ప్రియుడు (జిమ్ ట్రైనర్) పన్నాగం బయటపడడంతో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. జిమ్ ట్రైనర్‌తో ఉన్న సంబంధం గురించి భర్తకు తెలియడంతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిగ్భ్రాంతి కరమైన ఈ స్టోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వసుంధర సెక్టార్ 1లోని జగృతి RWA సొసైటీలో శశాంక్ కంతారియాను హత్య చేయాలని శశాంక్ భార్య ప్రియా శర్మ, ఆమె ప్రియుడు ప్రతాప్ సింగ్ (ఫిట్‌నెస్ హెడ్‌క్వార్టర్స్ జిమ్ ట్రైనర్)తో కలిసి ప్లాన్ వేసింది. అక్టోబర్ 26న తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో అతనిపై దాడిచేశారు. కత్తితో పలుమార్లు పొడిచారు. అయితే తీవ్రంగా గాయపడిన శశాంక్ కేకలు వేయడంతో, నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను ఆసుపత్రికి తరలించారు.

శశాంక్ సోదరుడి ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీసులు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసు నమోదు చేసి నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. దాడికి ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 1600 మీటర్లలో గెలుపు : ఉద్యోగ పందెంలో కవితకు ఓటమి
దాడికి కుట్ర ఇలా..
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గత 7-8 నెలలుగా జిమ్‌కు వెళ్తున్న ప్రియా శర్మకు, ట్రైనర్ ప్రతాప్ సింగ్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరు పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, వీరి సంబంధం గురించి భర్త శశాంక్‌కు తెలియడంతో ఆయన దీపావళి తర్వాత వేరే ఫ్లాట్‌కు మారాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఈక్రమంలోనే అక్టోబర్ 25న ఉదయం వాకింగ్ సమయంలో కలసిన ప్రియా, ప్రతాప్‌లు శశాంక్‌ను అంతమొందించాలని పథకం వేశారు. పథకంలో భాగంగా అక్టోబర్ 26 ఉదయం ప్రియా ఇంటి తలుపులు తెరిచి ఉంచగా, ప్రతాప్ లోపలికి ప్రవేశించి శశాంక్‌పై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు.
ఇదీ చదవండి: ఏడేళ్లకే 12 భాషలు : కుమార్తె పెంపకంలో హీరోయిన్ స్పెషాల్టీ ఇదే!


