భర్త నిర్వాకం..స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి | Married Woman Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

భర్త నిర్వాకం..స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి

Oct 28 2026 12:30 PM | Updated on Oct 28 2026 12:38 PM

Married Woman Incident In Hyderabad

హైదరాబాద్‌: వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కంచన్‌బాగ్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బాలాపూర్‌ రోషన్‌దౌలా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫయాజ్‌ (30) మయన్మార్‌కు చెందిన ఓ యువతిని (19)ని ఈ ఏడాది మే నెలలో వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన మహ్మద్‌ ఫయాజ్‌ తన స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారిని సైతం సుఖపెట్టాలని భార్యపై ఒత్తిడి చేసేవాడు. 

ఈ క్రమంలో ఆమెను ఫయాజ్‌ స్నేహితులైన నూర్‌ కమల్‌(30), ముజీబ్‌(29), జియా ఉర్‌ రెహమాన్‌ ఆలియాస్‌ ఇబ్రహీం(30)లు ఆమెను ఇంట్లోనే నిర్బంధించి సామూహికంగా అత్యాచారానికి పాల్ప డ్డారు. ఈ క్రమంలో ఇంటి యజమాని కరెంటు బిల్లు, అద్దె నిమిత్తం ఇంటికి రాగా ఈ దారుణం బయటపడింది. ఈ మేరకు బాధితురాలు కంచన్‌బాగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను భరోసా కేంద్రానికి పంపించి ముగ్గురు నిందితులను మంగళవారం అరెస్ట్‌ చేశారు. ఫయాజ్‌ పరారీలో ఉన్నాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement