రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా | Telangana Congress Leaders Lightning Dharna At Railway Nilayam | Sakshi
Sakshi News home page

రైల్వే నిలయం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా

Oct 28 2026 12:11 PM | Updated on Oct 28 2026 12:40 PM

Telangana Congress Leaders Lightning Dharna At Railway Nilayam

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌ రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైల్వే నిలయం ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నా నిర్వహించింది. ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మెట్లపై బైఠాయించిన కాంగ్రెస్‌ నేతలు.. ఆందోళనకు దిగారు. నవంబర్ 1న ఢిల్లీకి వెళ్ళేందుకు ప్రత్యేక రైళ్లు కావాలని పీసీసీ కోరగా.. దక్షిణ మధ్య రైల్వే శాఖ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్‌ నేతలు.. రైల్వే శాఖ జీఎం కార్యాలయం ముందు మెరుపు ధర్నాకు దిగారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మల్కాజిగిరి జోన్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement