‘టాటాను నాశనం చేస్తున్నారు’.. రాహుల్ గాంధీ ఫైర్! | Tata being criminally destroyed Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘టాటాను నాశనం చేస్తున్నారు’.. రాహుల్ గాంధీ ఫైర్!

Oct 28 2026 12:47 PM | Updated on Oct 28 2026 12:52 PM

Tata being criminally destroyed Rahul Gandhi

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్‌ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్‌ను ‘నేరపూరితంగా నాశనం చేస్తున్నారని’ ఆరోపించారు. ఈ పరిణామాలపై దేశంలోని ఏ వ్యాపారవేత్త కూడా నోరు విప్పడానికి ధైర్యం చేయడం లేదని విమర్శించారు. వ్యాపారవేత్తలు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఆయన ఒక పోస్టు చేశారు.

టాటా గ్రూప్‌ విషయంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాపారవేత్తలు మౌనం వీడాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ‘టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నా, ఏ వ్యాపారవేత్త కూడా మాట్లాడటానికి ధైర్యం చేయడం లేదు. ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు? వారు మిమ్మల్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకునే వరకు వేచి చూస్తారా? భారత వ్యాపార రంగం మోదీ, అమిత్ షాల ఆటబొమ్మ కాదు. మీకు ధైర్యం లేదు. మాకు ఉంది. ఈ నేరాలకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై బీజేపీ, టాటా గ్రూప్‌ నుంచి ఇంకా స్పందన రాలేదు.

దేశంలోని పురాతన పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా గ్రూప్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌, దానిలో కీలక వాటాదారుగా ఉన్న టాటా ట్రస్ట్స్‌ మధ్య విభేదాలు నెలకొన్నాయి. సెప్టెంబర్‌ 17న ఎన్‌. చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ నోయెల్‌ టాటా వ్యతిరేకించారు. 2022లో చంద్రశేఖరన్‌ పునర్నియామకానికి అనుసరించిన విధానానికి భిన్నమైన రాజ్యాంగపరమైన మార్గాన్ని ఈసారి అనుసరించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

టాటా ట్రస్ట్స్‌ వాదన ప్రకారం.. ఛైర్మన్‌ పునర్నియామకానికి సంబంధించి ట్రస్ట్స్‌ నామినేట్‌ చేసిన డైరెక్టర్లలో మెజారిటీ మద్దతు తప్పనిసరి. ఆ మద్దతు లేనప్పుడు ఛైర్మన్‌కు ఉండే నిర్ణయాత్మక ఓటు హక్కుతో సమస్యను అధిగమించలేరని ట్రస్ట్స్‌ అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, టాటా సన్స్‌ సంస్థ ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌లోని 104బీ, 118, 121 నిబంధనలను ఆధారంగా చేసుకుంటోంది. ఓట్ల సంఖ్య సమానమైనప్పుడు ఛైర్మన్‌కు నిర్ణయాత్మక ఓటు హక్కు ఉంటుందనే నిబంధనపైనా చర్చ జరుగుతోంది. 

ఇదీ చదవండి: జడ్జి కుమారుడి నిర్వాకం .. కొచ్చి పోలీస్‌ కమిషనర్‌ బదిలీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement