breaking news
commments
-
వాళ్లిద్దరూ మేకవన్నె పులులు
-
శనికి మరో రూపమే చంద్రబాబు: కొడాలి నాని
-
స్వామీజీలు సినిమాల్లో నటిస్తే తప్పుకాదు
సాక్షి,బెంగళూరు: కాషాయ వస్త్రాలు ధరించిన వారు సినిమాల్లో నటించడాన్ని పేజావర మఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామీజీ సమర్థించారు. స్వామీజీలు నటించడం అపచారం కాబోదని మీడియాతో ఆదివారం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ధార్మిక సంస్థలకు చెందిన కొంతమంది మఠాధీశులు, సిబ్బంది వెండి తెరపై నటించడంతోపాటు బుల్లితెరపై జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఇటీవల విమర్శలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో విశ్వేశ తీర్థస్వామీజీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సినిమాల్లో, టీవీల్లో నటించడం తప్పుకాదు. అయితే నటన, వాఖ్యలు సమాజానికి ఉత్తమ సందేశాన్ని తీసుకువెళ్లాలి. అప్పుడు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయంలో స్వామిజీలను తప్పుపట్టాల్సిన పనిలేదు.’ అని ఆయన పేర్కొన్నారు.