జయంతి వేడుకల్లో ప్రధాని మోదీపై ఖర్గే మాటల మంటలు | Storm Over Mallikarjun Kharge Against PM Modi | Sakshi
Sakshi News home page

జయంతి వేడుకల్లో ప్రధాని మోదీపై ఖర్గే మాటల మంటలు

Oct 26 2026 7:53 AM | Updated on Oct 26 2026 8:03 AM

Storm Over Mallikarjun Kharge Against PM Modi

పట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీతో పాటు ఆయన తండ్రిని, దేశాన్ని ఖర్గే అవమానించారంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా నేడు  దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఆదివారం బిహార్ రాజధాని పట్నాలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖర్గే.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌లో అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

సరిగ్గా అదే సమయంలో సభలో సంతోష్‌ అనే వ్యక్తి గట్టిగా ఏదో వ్యాఖ్యానించాడు. దానిపై ఖర్గే తీవ్రంగా మండిపడుతూ.. ‘మోదీ కా బాప్‌ భీ జాయేగా’ (మోదీ తండ్రి కూడా వెళ్తాడు) అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడే ఉన్న కాంగ్రెస్‌ శ్రేణులు సంతోష్‌ను వేదిక వద్ద నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో ఆయనపై కొంత తోపులాట కూడా జరిగింది.

నా మాటలను వక్రీకరించారు
ఈ వివాదంపై కేంద్ర బిందువైన సంతోష్ కుమార్ సభ వెలుపలి నుంచి మీడియాతో మాట్లాడారు. నేను అల్లరి చేసేందుకు ఇక్కడికి రాలేదు. సభలో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నేను ‘మోదీ ఎక్కడికీ వెళ్లరు’ అని అనలేదు.. 'తిరుగుబాటు రాకపోతే మోదీ వెళ్లరు' అని మాత్రమే అన్నాను. నా మాటల్లో కొంత భాగం మాత్రమే వినిపించడంతో అది అపార్థానికి దారితీసింది అని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై బీజేపీ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు ఈ వివాదం రాజకీయంగా మరింత ముదురుతోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement