ఢిల్లీ వేదికగా బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సదస్సు  | 12th BRICS Parliamentary Forum to Begin in New Delhi on 26 october 2026 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వేదికగా బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం సదస్సు 

Oct 26 2026 2:57 AM | Updated on Oct 26 2026 2:57 AM

12th BRICS Parliamentary Forum to Begin in New Delhi on 26 october 2026

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ పార్లమెంటరీ ఫోరం 12వ సదస్సు నేడు ఢిల్లీలో ఘనంగా ప్రారంభం కానుంది. ‘ప్రజా కేంద్రీకృత అభివృద్ధికోసం పార్లమెంట్ల బలోపేతం’నినాదంతో పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌ వేదికగా నేడు, రేపు కొనసాగనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరై వివిధ దేశాల పార్లమెంటరీ ప్రతినిధి బృందాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సదస్సు ప్రారంభానికి ముందు రష్యా పార్లమెంటు దిగువ సభ డూమా చైర్మన్‌ వ్యాచెస్లావ్‌ వోలోడిన్‌తో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఆదివారం సమావేశమయ్యారు. 

ప్రపంచ వేదికలపై బలమైన సహకారం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు రష్యా అందిస్తున్న మద్దతును బిర్లా ప్రశంసించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కలి్పంచే విషయంలో రష్యా సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాదికి 80 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అణుశక్తి, పరిశ్రమలు, వాణిజ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. అనంతరం ఈజిప్‌్ట, క్యూబా, బెలారస్‌ ప్రతినిధి బృందాలతోనూ ఆయన వరుసగా సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement