ప్రత్యేకంగా సిద్దం చేసిన ‘షాహీ తాజ్’సంస్థ
జైపూర్: ఫ్లైదుబాయ్ విమానంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హైజాకర్ బారి నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌కు బహూకరించేందుకు ప్రత్యేకంగా తలపాగాను సిద్ధం చేశామని రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన షాహీ తాజ్ సంస్థ ఆదివారం తెలిపింది. ఈ తలపాగాను కెప్టెన్ స్మిత్‌కు అందించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను కోరామని ఆ సంస్థ యజమానులైన జినేశ్, జయంత్ కొఠారి తెలిపారు.
హైజాకర్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ విధి నిర్వహణలో స్మిత్ మచ్ఛార్ కనబరిచిన ధైర్యసాహసాలు తమను ఎంతో కదిలించి వేశాయన్నారు. మన దేశం పేరు, ప్రతిష్టలను నిలిపిందుకు సంప్రదాయ తలపాగాను ఆయనకు బహూకరించాలని నిర్ణయించుకున్నామన్నారు. రాజస్తాన్ వీరత్వ సంప్రదాయాన్ని, మేవార్ సాంస్కృతిక వారసత్వం, విమానయానానికి సంబంధించిన చిహ్నాలను తలపాగాపై ప్రముఖంగా కనిపించేలా ‘భోపాల్‌షాహి’స్టయిల్‌లో రూపొందించామని చెప్పారు. దీంతోపాటు, డిజైన్‌లో 174 అనే సంఖ్యను మరియు సాహసానికి గుర్తుగా వాడామన్నారు.


