‘సర్‌’కు ముందే తీసేశారు.. సర్‌ | SIR 2026 Voter Deletions Telangana State Latest Data | Sakshi
Sakshi News home page

‘సర్‌’కు ముందే తీసేశారు.. సర్‌

Oct 29 2026 9:34 AM | Updated on Oct 29 2026 9:34 AM

SIR 2026 Voter Deletions Telangana State Latest Data

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణకు ముందే 4,54,340 మంది ఓటర్ల తొలగింపు

డిమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీ, ఫొటో సిమిలర్‌ ఎంట్రీ పేరుతో ఈసీ వేటు

ఇక ముసాయిదా ప్రచురణ సమయంలో 73,39235 మంది ఓటర్ల తొలగింపు

ఎన్యూమరేషన్‌ దశలో 228 మంది, అభ్యంతరాల దశలో మరో 40,662 మంది కట్‌

నోటీసులు/విచారణ దశలో మరో 49,742 ఓటర్ల తొలగింపు

మొత్తం తొలగించిన ఓట్లు 78 లక్షలకు పైనే!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌), 2026 ప్రక్రియ ప్రారంభానికి ముందు, ప్రారంభమైన తర్వాత కలిపి వివిధ దశల్లో ఇప్పటివరకు 78,97,034  మంది ఓటర్లను తొలగించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం వెల్లడించిన తాజా గణాంకాలు ఈ మేరకు రాష్ట్రంలో చోటుచేసుకున్న భారీ ఓట్ల తొలగింపును వెలుగులోకి తెచ్చాయి. 

‘సర్‌–2026’ ప్రక్రియ చేపట్టడానికి ముందు రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లుండగా, ఆగస్టు 17న 73,39,235 మంది ఓటర్లను తొలగించి 2,64,87,213 మంది ఓటర్ల పేర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు 73 లక్షల మంది ఓటర్లను తొలగించారనే భావనే సర్వత్రా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో సర్, 2026 ప్రక్రియ ప్రారంభా నికి ముందు.. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 14 మధ్య కాలంలో 4,54,340 మంది ఓటర్లను తొలగించారు.

‘ఈఆర్వో నెట్‌’ సాఫ్ట్‌వేర్‌ ద్వారా డెమోగ్రాఫిక్‌ సిమిలర్‌ ఎంట్రీస్‌ (డీఎస్‌ఈ), ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌ (పీఎస్‌ ఈ) కలిగి ఉన్న ఓటర్లను గుర్తించి ఈ మేరకు భారీ సంఖ్యలో ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా తొలగించడం గమనార్హం. ఒకే తరహా ఓటరు పేరు, బంధువు పేరు, బంధుత్వం, పుట్టిన తేదీ, లింగం కలిగి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో పేరు కలిగిఉన్న వారిని ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ‘డీఎస్‌ఈ’ ఓటర్లుగా గుర్తించి తొలగించారు.

ఓటర్ల ఫొటోలూ ఒకే తరహాలో ఉన్నా ఇదే సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. వీరిని పీఎస్‌ఈ ఓటర్లుగా గుర్తించి తొలగించారు. వాస్తవానికి జనవరి 1 నుంచి జూన్‌ 14 మధ్య ఓటర్ల తొలగింపు కోసం మొత్తం 5,13,375 ఫారం–7 దరఖాస్తులు రాగా, 4,54,340 ఓటర్లను తొలగించారు. మరో 47,303 ఫారం–7 దరఖాస్తులను తొలగించి మిగిలిన 11,732 దరఖాస్తుల విషయంలో నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచారు.  ఇలా తొలగించిన ఓటర్లందరూ డీఎస్‌ఈ, పీఎస్‌ఈ ఓటర్లేనని సీఈఓ కార్యాలయవర్గాలు ధ్రువీకరించాయి. ఇదంతా రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ ప్రారంభానికి ముందు జరిగింది.

సర్‌ ప్రారంభమైన తర్వాత..
సర్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిర్దేశిత గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాన్ని నింపి తిరిగి ఇవ్వకపోవడంతో .. ఆచూకీ లేరు/శాశ్వతంగా నివాసం మారారు/చనిపోయారు/ మరోచోట ఓటుకలిగి ఉన్నారనే కారణం చెప్పి మరో 73,39, 235 మంది ఓటర్లను తొలగించారు. ఇదే ఎన్యూమరేషన్‌ దశలో 11,732 మంది ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7 దరఖాస్తులు రాగా, 228 ఓటర్ల పేర్లను తొలగించారు.

ఇక ముసాయిదా జాబితా ప్రకటించాక నిర్దే శిత గడువు అక్టోబర్‌ 7 వరకు మళ్లీ కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల తొలగింపునకు అభ్యంతరాలు స్వీకరించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలోని 15,442 మంది ఓటర్లను తొలగించాలని కోరుతూ ఫారం–7 రూపంలో అభ్యంతరాలు దాఖలు కావడంతో 12,827 మంది ఓటర్లను తొలగించారు. ఇలా మూడో దశలో తొలగించిన ఓటర్లను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం తొలగించిన ఓటర్ల సంఖ్య 78,06,620కు ఎగబాకింది.

ఇక దరఖాస్తులు, అభ్యంతరాల దాఖలుకు గడువు అక్టోబర్‌ 7తో ముగిసిన తర్వాత సైతం ఓటర్ల తొలగింపు కోసం ఏకంగా 43,522 ఫారం–7 దర ఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 40,662 మంది ఓటర్లను తొలగించారు. సర్, 2002 జాబితాలో పేరు లేకపోవడంతో మ్యాపింగ్‌ జరగని ఓటర్లతో పాటు పేరు ఉన్నా వివరాల్లో తేడాలున్న ఓటర్లు కలిపి మొత్తం 92,88,188 మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అనంతరం 89,63,065 ఓటర్లను అర్హులుగా నిర్ధారించగా, మరో 49,742 మందిని అనర్హులుగా తేల్చి తొలగించారు. ఈ విధంగా పలు దశల్లో రాష్ట్రంలో మొత్తం 78,97,034 మంది ఓటర్లను తొలగించారు.

ఇదీ చదవండి: త్వరలో 15 వేల ఉద్యోగాల భర్తీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement