రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా? | Indian Tech Couple Quits 1.3 Crore Salary Jobs In Canada To Build A Peaceful Life In Himachal Pradesh, Read Full Story | Sakshi
Sakshi News home page

రూ. కోటిన్నర జీతం వదిలేసిన టెకీ జంట, ఎందుకో తెలుసా?

Oct 29 2026 2:57 PM | Updated on Oct 29 2026 3:15 PM

Indian couple quit Rs 1-3 crore pa jobs in Canada to live in Himachal

విలాసవంతమైన జీవితం, సౌకర్యవంతమైన ఉద్యోగం. మంచి జీతం. ఒక సగటు జీవికి ఇంతకంటే ఏం కావాలి? అనుకుంటాం కదా! కానీ ఆ ఉద్యోగాలు వదిలేయాలని ఇద్దరు దంపతులు నిర్ణయించుకున్నారు. తమ డ్రీమ్ జాబ్ వదిలేసి మరీ పర్వతాల మధ్య ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని దిప్తీ నాయర్, ధనంజయ్ మోరే అనే టెకీ  జంట నిశ్చయించుకుంది. తర్వాత ఏం జరిగింది?  ఈ కథనంలో తెలుసుకుందాం.

కాంక్రీట్‌ జంగిల్‌ వాతావరణం కార్పొరేట్ జీవితానికి దూరంగా  కొండా, కోనల్లా నివసించాలని  ప్రతి ఒక్కరూ కలలు కంటారు.  కానీ  నిజంగా సాహసం చేసి తమ ఉద్యోగాలను వదిలి  ప్రశాంతమైన జీవితాన్ని నడపగలుతారా అంటే అవును అనేందుకు  కెనడాలో నివసించిన  ఒక భారతీయ జంటే అందుకు గొప్ప ఉదాహర . దీప్తి నాయర్  ధనంజయ్ మోర్  జంట కెనడాలోని టొరంటోలో   స్థిరపడ్డారు. ద్దరూ కలిసి సంవత్సరానికి సుమారు రూ. 1.3 కోట్ల ఆదాయం సంపాదిస్తున్నారు. అయినప్పటికీ, వారు ఒక విభిన్నమైన జీవితానికి ఆకర్షితులై, తమ మనసు చెప్పినట్లు విని హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలని నిర్ణయించు కున్నారు.

హిమాచల్‌లో హోమ్‌స్టే
అలా హిమాచల్ ప్రదేశ్‌లోని బీర్ (Bir) గ్రామానికి మారారు. కెనడాలో 4 ఏళ్ల పాటు సంపాదించిన సొమ్ముతో రూ. 22 లక్షలు ఒక నిధిగా ఏర్పరుచు కున్నారు.  వారు తాము నివసించడానికి వీలుగా ఉంటూనే,  గెస్ట్‌లకు కూడా అద్భుతమైన పర్వత దృశ్యాలను అందించే ఒక ప్రదేశం కోసం వెతికారు. చివరకు, ప్రతి గది నుండి సుందరమైన దృశ్యాలు కనిపించే ఒక ఇంటిని కనుగొని, దానికి 'ఆహిస్తా స్టేస్' (Aahista Stays) అని పేరు పెట్టారు. దాదానె రూ. 10 లక్షలు అనే హోమ్‌స్టేకి పెట్టుబడి పెట్టారు.  దీని ద్వారా 6 నెలల్లో  రూ. 7 లక్షల ఆదాయం సాధించారు.రాబోయే 1.5 సంవత్సరాల ఖర్చుల కోసం ఇంకా రూ. 12 లక్షల పొదుపు సొమ్ము మిగిలి ఉంది.

 

భారత్‌కు తిరిగి రావడానికి కారణం ముఖ్య కారణం ఏమిటంటే 
మనలో చాలా మంది నిజానికి కలలు కనేది ఏమిటంటే, మనం ప్రేమించే వారితో ఎక్కువ సమయం గడపడం, ప్రపంచాన్ని మరింతగా చూడటం, మనం ఇష్టపడే దానిలో పూర్తిగా లీనమైపోవడం, లేదా ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేకుండా ఒక మామూలు మంగళవారం మధ్యాహ్నం గడపడం అంటారు ఈ జంట. దీనికితోడు ముంబైలో ఉన్న దిప్తి తల్లిదండ్రులు వయసు పైబడినవారు కావడంతో వారికి దగ్గరగా ఉండాలనే కోరిక. అలాగే 9-5 జాబ్‌ కాకుండా సొంత వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. ఈ జంట ఆతిథ్య రంగంలోకి అడుగుపెట్టి, ఒక హోమ్‌స్టేను ప్రారంభించారు.

బీర్‌లో తక్కువ ఖర్చులతో పాటు హిమాలయ అందాల నడుమ ప్రశాంతమైన జీవితం లభిస్తోందని ఈ జంట చెబుతున్నారు. ప్రస్తుతం ధనంజయ్ ఒక అమెరికన్ కంపెనీకి ఫ్రీలాన్సర్‌గా రిమోట్ వర్క్ చేస్తున్నారు. దిప్తి కంటెంట్ క్రియేటర్‌గా రాణిస్తోంది.. ఏప్రిల్ నాటికి ఇది సరిగ్గా కుదరకపోతే, మళ్లీ కార్పొరేట్ ఉద్యోగంలో చేరే అవకాశాలు (బ్యాకప్ ప్లాన్స్) ఉన్నాయని తెలిపారు.దీప్తి ప్రకారం, బీర్‌లో నెలవారీ ఖర్చులు, అద్దె, కిరాణా సామాగ్రి, జిమ్ సభ్యత్వం, ఇంటి పనివాళ్ళు, వై-ఫై, బయట భోజనం, ఇంధనం మరియు ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ. 38వేలు అవుతాయి.

అంతేకాదు తాము తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ వర్తించే ఒక ఆదర్శవంతమైన మార్గం కాకపోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు ఎవరికి వారికే ప్రత్యేకం అని కూడా దీప్తి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement