బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఉన్న ప్రముఖ నటుడు, నిందితుడు దర్శన్‌కు మళ్లీ వెన్నునొప్పి వచ్చినట్లు చెప్పాడు. బుధవారం అప్రూవర్ ప్రదోష్‌ను పోలీసులు విచారించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శన్, పవిత్రాగౌడలతో పాటు ఇతర నిందితులను హాజరు పరిచారు.
ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పునీత్.. రేణుకాస్వామిని హత్య చేసిన షెడ్ వద్ద నటుడు దర్శన్, పవిత్రాగౌడను తాను చూడలేదని చెప్పాడు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెబుతూ పునీత్‌ను ప్రతికూల సాక్షిగా పరిగణించాలని జడ్జికి మనవి చేశారు. ఇంతలో దర్శన్ తనకు వెన్నునొప్పిగా ఉందని, జైల్లో చలి ఎక్కువగా ఉన్నందున నొప్పి తిరగబెట్టిందని తెలిపాడు. ఫిజియోథెరపీ చేయాలని ఆదేశించాలని జడ్జికి విన్నవించారు. అందుకు పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి సూచించారు.


