నైజీరియన్లు ఉంటున్న బ్యారక్‌లోనే పవిత్రగౌడని ఉంచండి! | Pavithra Gowda Seeks Separate Barrack in Jail | Sakshi
Sakshi News home page

నైజీరియన్లు ఉంటున్న బ్యారక్‌లోనే పవిత్రగౌడని ఉంచండి!

Oct 24 2026 7:34 AM | Updated on Oct 24 2026 7:51 AM

Pavithra Gowda Seeks Separate Barrack in Jail

కర్ణాటక: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న ఏ1 నిందితురాలు పవిత్రగౌడకు బెంగళూరు నగర 59వ సీసీహెచ్‌ కోర్టు షాక్‌నిచ్చింది. తను ఉన్న బ్యారక్‌లో నైజీరియన్స్‌ తనకు ఇబ్బందులు కలిగిస్తున్నందున నేరుగా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తినే పరిశీలించాలని పెట్టుకున్న అర్జీని 59వ సీసీహెచ్‌ కోర్టు కొట్టివేసింది. దీంతో అధిక సంఖ్యలో నైజీరియన్లు ఉంటున్న బ్యారక్‌లోనే కొనసాగాలని కోర్టు సూచించింది. 

అక్టోబర్‌ 6న పవిత్రగౌడ ఉంటున్న బ్యారక్‌లో నైజీరియన్‌ మహిళా ఖైదీలు ఆమెను వేధిస్తున్నారంటూ పవిత్రగౌడ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమెను వేరే బ్యారక్‌కు బదిలీ చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీంతో జైలు అధికారుల నుంచి న్యాయమూర్తి నివేదికను తెప్పించుకున్నారు. నివేదికను పరిశీలించిన కోర్టు న్యాయమూర్తి సుజాత సాంబ్రాణి ఈనెల 23న తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం విచారించిన కోర్టు పవిత్రగౌడను యథాస్థానంలోనే కొనసాగించాలని పరప్పన అగ్రహార జైలాధికారులకు సూచనలు చేశారు. దీంతో ఆమె మహిళా నైజీరియన్‌ ఖైదీలతోనే కాలం గడపాల్సి వస్తోంది. 

జగదీశ్, అనుకుమార్‌ అర్జీల రద్దు 
రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న జగదీశ్, అనుకుమార్‌ దాఖలు చేసిన అర్జీలను 59వ సీసీహెచ్‌ కోర్టు కొట్టివేసింది. 7వ నిందితుడు అనుకుమార్‌ చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు అపహరించి తీసుకెళ్లారు. చిత్రదుర్గానికీ చెందిన అటో డ్రైవర్‌ జగదీశ్‌ మరో నిందితుడితో కలిసి చిత్రదుర్గ డీఎస్పీ ముందు లొంగిపోయారు. అనంతరం బెంగళూరు పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేసి విచారించారు. తమకు కోర్టు బెయిల్‌ ఇవ్వాలని సీసీహెచ్‌ కోర్టులో అర్జీ పెట్టుకోగా జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. వీరి తరపున న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement