చైనాకు క్లీన్‌ చిట్లు చాలు.. నిజాలు చెప్పండి!  | PM Narendra Modi must come clean before India, Kharge attacks | Sakshi
Sakshi News home page

చైనాకు క్లీన్‌ చిట్లు చాలు.. నిజాలు చెప్పండి! 

Oct 24 2026 6:45 AM | Updated on Oct 24 2026 6:45 AM

PM Narendra Modi must come clean before India, Kharge attacks

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు సూటి ప్రశ్నలు 

‘అరుణాచల్‌లో పీఎల్‌ఏ కవ్వింపు చర్యలు’ వ్యాఖ్యలపై ఖర్గే ఆందోళన 

టాక్సింగ్‌ సమీపంలో చొరబాట్లను ఎందుకు దాచిపెట్టారని నిలదీత 

గల్వాన్‌ ఉదంతం తర్వాత చైనా నుంచి 102 శాతం పెరిగిన దిగుమతులు 

23 సార్లు మోదీ–షీ భేటీలు.. సాధించిన ఫలితమేంటి? 

ప్రతిపక్షాలపై దాడులు మాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చైనాకు పదేపదే క్లీన్‌ చిట్లు ఇవ్వడం ఆపి, సరిహద్దుల్లోని వాస్తవ పరిస్థితులపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. దౌత్యపరమైన చర్చలు, సమావేశాల పేరుతో కేవలం ఫొటోలకు ఫోజులివ్వడం మాని, వాస్తవాలతో కూడిన సమగ్ర ప్రకటన విడుదల చేయాలని ప్రధాని మోదీని నిలదీశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా సైన్యం (పీఎల్‌ఏ) కవి్వంపు చర్యలు, ఆర్థికపరమైన ఆందోళనలు, దౌత్యపరమైన సమావేశాలపై ఆయన ఎక్స్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి మూడు కీలక ప్రశ్నలు సంధించారు.  

జాతీయ భద్రత ప్రమాదంలో ఉందా? 
అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా బలగాల కవి్వంపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఐటీబీపీ డైరెక్టర్‌ జనరల్‌ ధ్రువీకరించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఖర్గే పేర్కొన్నారు. డోక్లాం, గల్వాన్‌ పరిణామాల తర్వాత సరిహద్దుల్లో మరో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంటోందా అని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు నెలలో టాక్సింగ్‌ సమీపంలో చైనా చొరబాట్లు జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. 

వాచా–దామై వద్ద కారŠప్స్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగిన 47 రోజుల తర్వాత కూడా, అక్కడికి కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి కవి్వంపులు కొనసాగుతుండటాన్ని తప్పుబట్టారు. సరిహద్దుల్లో భారత సైన్యానికి పెట్రోలింగ్‌ చేసుకునే హక్కులను కేంద్ర ప్రభుత్వం రాజీ పడిందా అని నిలదీశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో దేశాన్ని ఎందుకు చీకట్లో ఉంచుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఇంపోర్ట్‌ ఫ్రమ్‌ చైనాగా మారిందా? 
సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణిజ్యంపై కేంద్రం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఖర్గే ఎత్తిచూపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో గల్వాన్‌ లోయలో 20 మంది భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా చైనా దిగుమతులు ఏకంగా 102 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చైనాతో భారత వాణిజ్య లోటు 155 శాతం మేర పెరిగి రికార్డు స్థాయిలో 112.16 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని వెల్లడించారు.

 భారతీయ ఎగుమతులను చైనా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వం చైనా పెట్టుబడులపై ఆంక్షలు సడలించడం, చైనా అనుబంధ సంస్థలకు పీఎల్‌ఐ ప్రయోజనాలు కల్పించే యోచనలో ఉండటం దారుణమన్నారు. కేంద్రాన్ని చూస్తుంటే ‘మేక్‌ ఇన్‌ ఇండియా’పథకం కాస్తా ‘ఇంపోర్ట్‌ ఫ్రమ్‌ చైనా’గా మారిపోయిందా అని ఎద్దేవా చేశారు.

ఇన్ని సమావేశాలతో సాధించిందేమిటి? 
కేంద్ర ప్రభుత్వ దౌత్యపరమైన చర్యలు ఏమేరకు సత్ఫలితాలను ఇచ్చాయని ఖర్గే ప్రశ్నించారు. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య కనీసం 23 సార్లు సమావేశాలు, పరస్పర చర్చలు జరిగాయని గుర్తుచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ నేతృత్వంలో 25 సార్లు ప్రత్యేక ప్రతినిధుల చర్చలు, 36 సార్లు డబ్ల్యూఎంసీసీ సమావేశాలు జరిగాయన్నారు. వీటితో పాటు వరుసగా ఎస్‌సీఓ, బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులు జరిగాయని, ఇన్ని దౌత్యపరమైన చర్చల వల్ల సాధించిన స్పష్టమైన ఫలితాలు ఏమిటని నిలదీశారు. లద్దాఖ్‌తో 2020 మేకి ముందున్న పెట్రోలింగ్‌ హక్కులను భారత్‌ తిరిగి పొందిందా లేదా అనేది దేశ ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement