కర్ణాటక: సిద్దరామయ్య కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఓటర్లను ఆకర్షించగల నాయకులు ఎవరు ఉన్నారు అని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. శుక్రవారం బెంగళూరులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన సిద్దరామయ్య ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్ రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తమ పోరాటం సిద్దరామయ్య అధికారానికి వ్యతిరేకంగా సాగింది. మేం సిద్దరామయ్య వ్యక్తిత్వాన్ని నాశనం చేయలేదు. కానీ మీరే సిద్దరామయ్య వ్యక్తిత్వాన్ని అంతం చేయడానికి ప్రయతి్నస్తున్నారు సీఎం డీకే శివకుమార్‌పై దాడి చేశారు.
వ్యాపారవేత్తలు కర్ణాటక అంటేనే జంకుతున్నారు
వ్యాపారవేత్తలు కర్ణాటకకు రావడానికి భయడుతున్నారని కేంద్ర మంత్రి కుమారస్వామి ఆరోపించారు. వ్యాపారవేత్తలు కర్ణాటకకు వెళ్లడం అంటే చేతులు కట్టేయడమే. గతంలో వ్యాపారవేత్తలు కర్ణాటకకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎవరూ రావడం లేదు. కర్ణాటకలో 974 దరఖాస్తులు ఇంకా క్లియర్ కాలేదని ఆరోపించిన ఆయన అలాంటప్పడు వ్యాపారవేత్తలు కర్ణాటకకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు.
డీకే శివకుమార్‌ను సీఎంగా అంగీకరించను
మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తాను అంగీకరించనని చెబుతూ సీఎం డీకే శివకుమార్‌పై హెచ్‌డీ కుమారస్వామి ఎదురుదాడి చేశారు. మీ గురించి రాసిన పుస్తకాన్ని చదివితే మిమ్మిల్ని ఎవరూ సీఎంగా అంగీకరించలేరని ఆయన అంటూ డీకే శివకుమార్‌కు వ్యతిరేకంగా ఉన్న పుస్తకాన్ని ప్రదర్శించారు. స్టింగ్ ఆపరేషన్‌లో కనిపించిన కృపా ఆళ్వా కాంగ్రెస్ పార్టీ వారు. ఎందుకు తమ పార్టీ కార్యకర్తకు నోటీస్ ఇచ్చారు? స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేశారో చెప్పండి? అని డిమాండ్ చేశారు. దీనిపై హోం మంత్రి అయినా నిజం చెబుతారా అని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రాత్రంతా ఆదమరిచి.. దిండు పైనే నిద్రించి..


