breaking news
Barrack Number 12
-
నైజీరియన్లు ఉంటున్న బ్యారక్‌లోనే పవిత్రగౌడని ఉంచండి!
కర్ణాటక: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న ఏ1 నిందితురాలు పవిత్రగౌడకు బెంగళూరు నగర 59వ సీసీహెచ్ కోర్టు షాక్‌నిచ్చింది. తను ఉన్న బ్యారక్‌లో నైజీరియన్స్ తనకు ఇబ్బందులు కలిగిస్తున్నందున నేరుగా సెషన్స్ కోర్టు న్యాయమూర్తినే పరిశీలించాలని పెట్టుకున్న అర్జీని 59వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. దీంతో అధిక సంఖ్యలో నైజీరియన్లు ఉంటున్న బ్యారక్‌లోనే కొనసాగాలని కోర్టు సూచించింది. అక్టోబర్ 6న పవిత్రగౌడ ఉంటున్న బ్యారక్‌లో నైజీరియన్ మహిళా ఖైదీలు ఆమెను వేధిస్తున్నారంటూ పవిత్రగౌడ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఆమెను వేరే బ్యారక్‌కు బదిలీ చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీంతో జైలు అధికారుల నుంచి న్యాయమూర్తి నివేదికను తెప్పించుకున్నారు. నివేదికను పరిశీలించిన కోర్టు న్యాయమూర్తి సుజాత సాంబ్రాణి ఈనెల 23న తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. శుక్రవారం విచారించిన కోర్టు పవిత్రగౌడను యథాస్థానంలోనే కొనసాగించాలని పరప్పన అగ్రహార జైలాధికారులకు సూచనలు చేశారు. దీంతో ఆమె మహిళా నైజీరియన్ ఖైదీలతోనే కాలం గడపాల్సి వస్తోంది. జగదీశ్, అనుకుమార్ అర్జీల రద్దు రేణుకాస్వామి హత్య కేసులో నిందితులుగా ఉన్న జగదీశ్, అనుకుమార్ దాఖలు చేసిన అర్జీలను 59వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. 7వ నిందితుడు అనుకుమార్ చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు అపహరించి తీసుకెళ్లారు. చిత్రదుర్గానికీ చెందిన అటో డ్రైవర్ జగదీశ్ మరో నిందితుడితో కలిసి చిత్రదుర్గ డీఎస్పీ ముందు లొంగిపోయారు. అనంతరం బెంగళూరు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించారు. తమకు కోర్టు బెయిల్ ఇవ్వాలని సీసీహెచ్ కోర్టులో అర్జీ పెట్టుకోగా జడ్జి ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. వీరి తరపున న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదీ చదవండి: నటి ప్రియవదన ఆత్మహత్య -
12వ నంబర్ జైలు గదిలో మాజీ మంత్రి
ముంబై: కాలం కలిసిరాకపోతే కర్రే పాములా మారి కాటేస్తుందన్నది నానుడి. మహారాష్ట్ర రాజకీయ నాయకుడు, ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ కు ఇపుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. తాను దగ్గరుండి కట్టించిన జైలు గదిలోనే ఇప్పుడు ఆయన ఉండడం గమనార్హం. అవినీతి ఆరోపణలతో అరెస్టైన ఆయనకు ఆర్థర్ రోడ్డు జైలులో 12వ నంబర్ గదిని కేటాయించారు. 'బేరక్ నంబర్ 12'గా పిలిచే ఈ బుల్లెట్ ప్రూఫ్ గదిని 26/11 దాడిలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మాల్ కసబ్ కోసం 2008లో ప్రత్యేకంగా కట్టించారు. లష్కర్-ఈ-తోయిబా నుంచి కసబ్ ముప్పు పొంచివుందన్న నిఘా వర్గాల సమాచారంతో ఈ ప్రత్యేక సెల్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. అప్పుడు ప్రజాపనుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న భుజ్ బల్ ఇన్ చార్జిగా వ్యవహరించి ఈ జైలు గది నిర్మాణ బాధ్యలు పర్యవేక్షించారు. కాలం గిర్రున తిరిగింది. అవినీతి ఆరోపణలతో అరెస్టైన 68 ఏళ్ల భుజ్ బుల్ ఇప్పుడు ఇదే జైలు గదిలో గడపాల్సి వచ్చింది. సవతి కుమార్తె షీనా బోరా హత్య కేసులో నిందితుడిగా ఉన్న మీడియా ప్రముఖుడు పీటర్ ముఖర్జియా ఇదే సెల్ లో ఉన్నారు. వీరు 'బేరక్ నంబర్ 12' ఉన్నట్టు సీనియర్ పోలీసు అధికారి బిపిన్ కుమార్ సింగ్ ధ్రువీకరించారు. అయితే 2012లో కసబ్ ను ఉరి తీసిన తర్వాత దీన్ని పలు విభాగాలుగా విడదీసి హైప్రొఫైల్ ముద్దాయిలకు ప్రత్యేకించినట్టు వెల్లడించారు.


