వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విడుదల | YSRCP Alur MLA Virupakshi Released From Kurnool Jail After 69 Days As High Court Grants Bail, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విడుదల

Oct 10 2026 11:27 AM | Updated on Oct 10 2026 12:16 PM

YSRCP Alur MLA Virupakshi Released from Kurnool Jail After 69 Days

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరుపాక్షికి భారీ ఊరట లభించింది. చిప్పగిరి ఘర్షణకు సంబంధించి నమోదైన కేసుల్లో హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. విరుపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్‌, మరో 25 మంది కూడా విడుదలయ్యారు. 

శనివారం ఉదయం విరుపాక్షి విడుదల సందర్భంగా కర్నూలు జైలు వద్ద కోలాహలం కనిపించింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఇతర పార్టీ నేతలు విరుపాక్షికి, ఇతరలకు స్వాగతం పలికారు. 

అక్రమ కేసులతో..
కర్నూలు జిల్లా చిప్పగిరిలో ఆగస్టు 1న చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి ఎమ్మెల్యే విరుపాక్షితోపాటు పలువురిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం, వాహనాలపై దాడికి సంబంధించిన ఆరోపణలతో మూడు కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన్ని అరెస్ట్‌ చేసి కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. 

ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పార్టీ కేడర్‌ మొత్తం విరుపాక్షికి అండగా నిలబడింది. తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. అలా సుమారు 69 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయనకు తాజాగా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతులకు అనుగుణంగా ఆయన విడుదలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement