ఎన్ని వేధింపులున్నా వెనక్కి తగ్గం | Strike by medical contract employees continued for the fourth day on Friday | Sakshi
Sakshi News home page

ఎన్ని వేధింపులున్నా వెనక్కి తగ్గం

Oct 10 2026 5:32 AM | Updated on Oct 10 2026 5:32 AM

Strike by medical contract employees continued for the fourth day on Friday

వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు

సాక్షి, అమరావతి: సమస్యలు పరిష్కరించకపోగా తమపై ప్రభుత్వం వేధింపులకు దిగుతోందని వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్‌ నోటీసులు ఇచ్చి ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎన్ని వేధింపులకు పాల్పడ్డా ఏ మాత్రం వెనక్కు తగ్గబోమని ప్రభుత్వానికి తెగేసి చెప్పారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడే సమ్మెలోకి వెళ్లామని స్పష్టం చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. జీజీహెచ్‌లు, ధర్నా చౌక్‌ల్లోని నిరసన శిబిరాల్లో ఉద్యోగులు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు చేపట్టారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. వేల సంఖ్యలో ఉద్యోగులు అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు.

చంటి బిడ్డతో నిరసన
వైద్యశాఖలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసన ఉధృతంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా తిరుపతి రుయా ప్రాంగణంలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో గీత అనే స్టాఫ్‌నర్స్‌ తన చంటిబిడ్డతో కలసి పాల్గొన్నారు. ఆ చంటి బిడ్డ అమ్మఒడిలో నిద్రిస్తుండగా.. తల్లి మౌన దీక్షను కొనసాగించారు.  – తిరుపతి తుడా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement