ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కాకినాడ: ఉప్పాడ సముద్ర తీరంలో విషాదం చోటు చేసుకుంది. చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు గల్లంతైనట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 11వ తేదీన ఉప్పాడ తీరం నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. సాధారణంగా కొద్ది రోజుల్లోనే తిరిగి రావాల్సిన వారు, 13 రోజులు గడుస్తున్నా తీరానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.
సముద్రంలో బోటు బోల్తా పడినట్లు సమాచారం అందడంతో మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. 13 రోజులుగా వారి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గల్లంతైన వారిని క్షేమంగా వెనక్కి తీసుకురావాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి.


