నంద్యాల జిల్లా: జిల్లాలోని బనగానపల్లె నియోజవర్గం పరిధిలో అవుకు జనసేన పార్టీ మద్దతు దారులను మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్న మరో ఘటన వెలుగు చూసింది. గ్రామ పంచాయలీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని జనసేన నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మంత్రి జనార్థన్‌రెడ్డి అనుచరులు. ఈ విషయాన్ని అవుకు మండలానికి చెందిన జనసేన పార్టీ స్థానిక నాయకుడు అజిత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
టీడీపీ పార్టీకి ఊడిగం చేసిన జనసేన కార్యకర్తలకు ఇదేనా న్యాయం అంటూ ప్రశ్నించారు. అవుకు పట్టణ సర్పంచ్ గా జనసేన కార్యకర్త అజిత్ రెడ్డి అమ్మను పోటీలో నిలపడం తప్పా. మీరు అడిగితే విత్ డ్రా చేసుకొనే వాళ్ళం కదా. పోలీసులను ఇంటికి పంపించి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. జనసేన తరుపున 8 మందిని వార్డు మెంబర్లుగా బరిలో ఉంటే, ఇద్దరు నామినేషన్ లను తిరస్కరించి మరో ఆరు మందిని ఎత్తుకెళ్లి,చిత్ర హింసలకు గురిచేయడం ఎంతవరకు సబబు.
అందరం కూటమి అభ్యర్థులమే కదా.. యువత రాజకీయాల్లోకి రావాలి అని పవన్ కళ్యాణ్ పిలుపుతో వచ్చాం. పొలాలకు నీరు,యువతకు ఉద్యోగాల కోసం మేము పోటీ చేస్తుంటే.. మీరు మాకిచ్చే గౌరవం ఇదేనా?, మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ పెడితే మేము పూజకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాము. ఆ నోటితోనే మీకు శాపనార్థాలు పెట్టాలా?, దొంగసంతకాలతో విత్ డ్రా చేస్తాం అని బెదిరిస్తున్నారు. అలాచేస్తే మాత్రం పూర్తి బాధ్యత రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత వహించాలి. టీడీపీ నాయకుల కుట్రలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళతాం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల్లోనూ పత్తా లేని ఎమ్మెల్యే..


