‘ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?’ | YSRCP Leader Bhumana Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?’

Nov 24 2026 3:26 PM | Updated on Nov 24 2026 3:30 PM

YSRCP Leader Bhumana Slams Chandrababu Govt

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళల ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే చంద్రబాబు.. మహిళా అభ్యర్థులకు నామినేషన్ వేసే హక్కు లేకుండా చేస్తున్నారన్నారు. 

కూటమి పాలనలో మహిళలకు ఇంట్లోనూ రక్షణ లేదు.. బయటకెళ్లినా రక్షణ లేదన విమర్శించారు. ఈరోజు(మంగళవారం, నవంబర్‌ 24వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వరుదు కళ్యాణి..  ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే విషయం ఎన్నికల్లో అక్రమాలతో తేలిపోయిందన్నారు. 

‘నామినేషన్ల నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తున్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారు.  మైదుకూరు, జమ్మలమడుగులో మహిళా అభ్యర్థులపై దాడులు చేయడం సిగ్గుచేటు. మహిళల చీరలు లాగుతూ, నామినేషన్ పత్రాలు లాక్కుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణం. పల్నాడులో అభ్యర్థులకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే నామినేషన్లు వేయొద్దని బెదిరిస్తున్నారు. పులివెందులలో డీఎస్పీ స్థాయి అధికారి వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికి విరుద్ధం.

స్క్రూటినీ సమయంలో పత్రాలు చించేసి, చిన్న చిన్న కారణాలతో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారు. తాళిబొట్టు వివరాలు లేవంటూ మహిళా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దారుణం. మహిళల గౌరవం గురించి మాట్లాడే చంద్రబాబు.. మహిళా అభ్యర్థులకు నామినేషన్ వేసే హక్కు లేకుండా చేస్తున్నారు. మహిళలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గౌరవం కల్పించిన ఘనత జగన్‌‌దే’ అని స్పష్టం చేశారు. 

‘చంద్రబాబు పాలనలో అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల స్క్రూటినీ అయినా పూర్తిగా నిష్పక్షపాతంగా నిర్వహించాలి. నామినేషన్ల నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పించాలి. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావివ్వకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. ఎన్ని దౌర్జన్యాలు చేసినా వైఎస్సార్‌సీపీ ఓట్ల శాతం పెరిగిందని ప్రజలే నిరూపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ‘ఆ మహిళది ఆత్మహత్య కాదు.. హత్య’.. భూమన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement