సాక్షి,విజయనగరం : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు ఎంపీ శ్రీభరత్‌కు పార్టీ శ్రేణులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన భరత్‌ను సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. భరత్ తమ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీల్లేందంటూ భీష్మించుకున్నారు. దీంతో చేసేది లేక ప్రచారం చేయకుండానే వెనక్కి వెళ్లిపోయారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం వెంకటరమణపేట టీడీపీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గ్రామంలో ఇద్దరు టీడీపీ సానుభూతిపరులు జుత్తాడ భవానీ,కనికశెట్టి సత్యవతి వేర్వేరుగా సర్పంచులుగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే మంగళవారం జుత్తాడ భవానీకి మద్దతుగా ఎంపీ భరత్‌తో పాటు ఇతర శ్రేణులు ప్రచారానికి వచ్చారు.
దీంతో వెంకటమరణపేట గ్రామంలో మరో వర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు ఎంపీ భరత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి ఎన్నికల ప్రచారం చేసేందుకు వీలులేదని హుకుం జారీ చేశారు. ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఇతర పార్టీ నేతలు..శ్రేణుల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు తలొగ్గలేదు. చివరకు ప్రచారం చేయకుండా వెనక్కి వెళ్లిపోవడం చర్చాంశనీయంగా మారింది.

ఇదీ చదవండి : ‘ఆ మహిళది ఆత్మహత్య కాదు.. హత్య’


