గత నెల 17వ తేదీన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కాల్పులు జరుపుతున్న దృశ్యం(ఫైల్‌పోటో)
వైఎస్ఆర్ జిల్లా: పులివెందుల కోర్టులో పోలీసులకు షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు పెట్టిన కేసును అక్రమ కేసుగా తేల్చింది కోర్టు. అదే సమయంలో డీఎస్పీ మురళీ నాయక్‌పై కోర్టు సీరీయస్ అయ్యింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని డీఎస్పీ మురళీ నాయక్‌ను హెచ్చరించింది పులివెందుల కోర్టు.
గత నెల 17వ తేదీన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్సార్‌సీపీ నాయకులే.. పోలీసులపై దాడి చేశారంటూ హత్యాయత్నం కింద అక్రమ కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు రామ్‌నాథ్‌రెడ్డి, ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం వీరిని కోర్టులో హాజరు పరిచారు. దీన్ని విచారించిన కోర్టు.. ఇది అక్రమ కేసు అంటూ తేల్చింది.. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేసింది.

(ఫైల్ ఫోటో)
కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గత నెల 17వ తేదీన పులివెందులలో కూటమి ప్రభుత్వం సృష్టించింది. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే.. వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలు ధ్వంసం చేశారు. టీయర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపారు.
నామినేషన్ వేసేందుకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రాగా.. వారిని అడ్డుకుని నానా హంగామా సృష్టించారు. టీడీపీ గూండాలను మాత్రం అడ్డుకోని పోలీసులు.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ప్రతాపం చూపించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు రాళ్లు విసరడం, కాల్పులు జరపడం వంటి చర్యలకు దిగారు.

(ఫైల్ ఫోటో)
అయితే తిరిగి వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు పెట్టారు పోలీసులు. సోమవారం రామ్‌నాథ్ రెడ్డి, ఖాన్‌లను అరెస్టు చేయగా, ఈ రోజు కోర్టు ముందు హాజరిపరిచారు. ముద్దాయి హక్కులను పోలీసులు కాలరాశారని వాదించారు లాయర్ ఓబుల్‌రెడ్డి. అరెస్ట్ నేపథ్యంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్తూ సంబంధిత రికార్డు ఇవ్వాల్సి ఉందని అడ్వకేట్ ఓబుల్ రెడ్డి వాదనలు వినిపించారు.
అవేమీ పాటించని పులివెందుల పోలీసులపై కోర్టు సీరియస్ అయ్యింది. ముద్దాయిల హక్కులకు భంగం కలిగించినందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. మరోసారి ఇలాంటి తప్పిదం జరిగితే సీరియస్ యాక్షన్ ఉంటుందని డీఎస్పీ మురళి నాయక్‌ను హెచ్చరించింది కోర్టు. అదే సమయంలో అక్రమంగా అరెస్టు చేసిన ఇద్దరు వైఎస్సార్‌సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసింది.
ఇదీ చదవండి: ఏపీలో జరిగినవి ఎన్నికలేనా? : విడదల రజిని


