తిరుపతి జిల్లా: జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు 2,700 నామినేషన్లు తిరస్కరించడంపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంతో కుమ్మక్కైన అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. అప్పీల్‌లను కూడా తిరస్కరించారని, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? అని నిలదీశారు. నామినేషన్లు వేయకుండా రౌడీలు, గూండాలను తీసుకొచ్చి దౌర్జన్యం చేశారన్నారు.
కోట్లు తీసుకుని నామినేషన్ పత్రాలు చింపి వేశారు, ఈ స్థాయికి అధికార వ్యవస్థ దిగజారింది. దేశం మొత్తం మీద 542 మంది ఎన్నికల నామినేషన్లు తిరస్కరణపై అప్పీలకు వెళ్ళిన చరిత్ర లేదు. 38 మంది ఆర్‌ఓలు , ఆర్డీవో, డిపివో వీళ్ళకు అధినేత కలెక్టర్ కలిసి భ్రస్టు పట్టించారు. ఓటమి భయంతో టీడీపీ నాయకులు నామినేషన్లు అడ్డుకున్నారు.. ఆపై తిరస్కరించారు.
ఎన్నికల అధికారులు చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. వేలాదిమంది రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిన ఏ అధికారి తప్పించుకోలేరు. ఎన్నికల అధికారులు ఒక రాజకీయపార్టీకు తోత్తులుగా మారిపోయారు. డబ్బులకు కక్కుర్తి పడ్డ అధికారుల అవినీతి సొమ్ము తో అక్రమ ఆస్తులు కూడా బెట్టారు. ఈరోజు టిడిపి వాళ్ళు చేసిన ప్రతి తప్పును చట్టం ముందు నిలబెడతాం’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసు.. డీఎస్పీ మురళీనాయక్‌పై కోర్టు సీరియస్


