తాడేపల్లి : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత -ఎ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. క్రికెట్ చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీకి హృదయపూర్వక అభినందనలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
28 బంతుల్లోనే సెంచరీ.. 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు ప్రపంచ రికార్డులు సృష్టించడం అసాధారణం. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన అద్భుతమైన ప్రతిభతో యావత్ దేశం గర్వపడేలా చేశాడు. వైభవ్ నిర్భయమైన ఆటతీరు, అసాధారణ ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సృష్టిస్తూ దేశానికి గర్వకారణంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని అభినందనలు తెలిపారు.
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead #RisingStarsAsiaCup
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2026
ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం.. సెమీస్‌లో టీమిండియా


