స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్న పాక్‌.. నేపాల్‌పై ఘన విజయం | Asia Cup Rising Stars 2026: Pakistan A beat Nepal by 96 runs | Sakshi
Sakshi News home page

స్వల్ప స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకున్న పాక్‌.. నేపాల్‌పై ఘన విజయం

Nov 24 2026 9:27 PM | Updated on Nov 24 2026 9:27 PM

Asia Cup Rising Stars 2026: Pakistan A beat Nepal by 96 runs

source: X

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా ఇవాళ జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో నేపాల్‌పై పాకిస్తాన్‌-ఎ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైనా, ఆతర్వాత దాన్ని విజయవంతంగా కాపాడుకుంది.

ఐదేసిన రషీద్‌ ఖాన్‌
రషీద్ ఖాన్‌ (8-0-39-5)‌తో పాటు అభిషేశ్‌ గౌతమ్‌ (9-1-27-2), సందీప్‌ లామిచ్చేన్‌ (7-0-21-1), కుషాల్‌ భుర్టెల్‌ (9-0-35-1) రాణించడంతో పాక్‌ 42 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్‌ ఆటగాడు, వికెట్‌కీపర్‌ రోహైల్‌ నజీర్‌ (64) అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. ఆఖర్లో రోహైల్‌.. అహ్మద్‌ దనియాల్‌ (16) సాయంతో పాక్‌ను 100 పరుగుల మార్కును దాటించాడు.

స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్‌ బౌలర్ల ధాటికి నేపాల్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. మొహమ్మద్‌ ఇమ్రాన్‌ రంధవా (2-29), మొహమ్మద్‌ హస్నైన్‌ (3-21), సుఫ్యాన్‌ మొకిమ్‌ (3-17), మాజ్‌ సదాకత్‌ (1-5) చెలరేగడంతో నేపాల్‌ జట్టు 17.3 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. 

నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ మయాన్‌ యాదవ్‌ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. బషీర్‌ అహ్మద్‌ (11) అతికష్టం మీద రెండంకెల మార్కును తాకాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లయ్యారు. ఈ ఓటమితో నేపాల్‌ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.  

మరోవైపు ఈ గెలుపుతో సంబంధం లేకుండానే పాక్‌ సెమీస్‌కు చేరింది. అయితే ఈ గెలుపు తర్వాత గ్రూప్‌ (బి) టాపర్‌గా అవతరించింది. ఈ గ్రూప్‌లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. గ్రూప్‌-ఎ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌-ఎ జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. నవంబర్‌ 26న జరిగే తొలి సెమీఫైనల్లో భారత్‌, శ్రీలంక-ఎ జట్లు.. నవంబర్‌ 27న జరిగే రెండో సెమీఫైనల్‌ పాక్‌, బంగ్లాదేశ్‌-ఎ జట్లు తలపడనున్నాయి.

ఇదీ చదవండి: వైభవ్‌ సూర్యవంశీ మహోగ్రరూపం.. సెమీస్‌లో టీమిండియా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement