బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వాట్ ఫ్రా బాట్ నాంఫు ఆలయ ఆశ్రయ విరాళాల దుర్వినియోగం కేసులో మాజీ బౌద్ధ సన్యాసి అలోంగ్‌కోట్ పూన్‌మూక్ (Alongkot Poonmook)కు, అతని అనుచరుడు సేక్సన్ సప్సుబ్సకుల్‌కూ 50 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫ్రా రాట్చా విసుత్తిప్రచానత్‌గా ప్రసిద్ధిగాంచిన అలోంగ్‌కోట్ ఒకప్పుడు ఆ ఆలయ మఠాధిపతిగా పనిచేశారు. ఆ సమయంలో ఆలయానికి చెందిన ఎయిడ్స్ ఆశ్రమం విరాళాలను అలోంగ్‌కోట్, అతని సహచరుడు సేక్సన్ సప్సుబ్సకుల్‌తో కలిసి స్వాహా చేశారు.
ఈ ఆర్థిక కుంభకోణం బయటికి రావడంతో ఆయన సన్యాస విరమణ చేయాల్సి వచ్చింది. నిధుల దుర్విని యోగం, మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు అభియోగాలపై ఇద్దరినీ దోషులుగా కోర్టు నిర్ధారించింది. కోర్టు అలోంగ్‌కోట్‌కు 742 ఏళ్లు, సేక్సన్‌కు 386 ఏళ్లకు పైగా శిక్ష విధించింది. అనంతరం ఆ శిక్షలను చట్టప్రకారం 50 ఏళ్లకు తగ్గించింది. అంతేకాదు అలోంగ్‌కోట్ మఠాధిపతిగా పనిచేసిన వాట్ ఫ్రా బాట్ నాంఫు ఆలయంలోని హాస్పిస్‌కు 300 మిలియన్ బాత్‌లకు పైగా (దాదాపు రూ.90 లక్షలు) తిరిగి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి: 5 కాసుల గోల్డ్ చైన్ కొట్టేసింది : యూట్యూబర్ మధుమితపై కేసు
బౌద్ధుల జనాభా అధికంగా ఉన్న థాయ్‌లాండ్‌లో ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. దీనికి అనుబంధంగా 1992లో అలోంగ్‌కోట్ హాస్పిస్‌ను ఒక మార్గదర్శక మానవతా ప్రాజెక్ట్‌గా స్థాపించారు. ఆ తరువాత ఇతర తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించేలా హాస్పిస్‌ను విస్తరించారు. ఈ ఆలయం నిరుపేద పిల్లల చదువుకు నిధులు సమకూర్చేందుకు స్వచ్ఛంద సంస్థలను కూడా నడుపుతోంది. కానీ ఈ ఆర్థిక కుంభకోణంతో ఆ ఆలయ ప్రతిష్ట దెబ్బతింది.

ఇదీ చదవండి: పాములు పట్టేవాడు.. పాముకాటుకు బలైపోయాడు!
ఇదీ చదవండి: నానా పటేకర్ లాస్ట్ మెసేజ్, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!


