ఒంటినిండా బంగారం, డబ్బుల కట్టలతో సోషల్‌మీడియాలో రీల్స్ చేసి ఎదురు దెబ్బతిని వార్తల్లో నిలిచిన యూట్యూబర్ మధుమితకు ఇపుడు మరో షాక్ తగిలింది. దీనికి సంబంధించి ఈ వివాదం నెట్టింట వైరల్‌గామారింది. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన 89 ఏళ్ల ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ ఫిర్యాదు ప్రకారం మధుమితపై రాజక్కమంగళం పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఎందుకో తెలుసా?
2022లో ఒక 89 ఏళ్ల భవన నిర్మాణ కాంట్రాక్టర్ నుండి ఐదు సవర్ల బంగారు గొలుసును ఆమె దొంగిలించిందన్న ఆరోపణతో ఈ కేసు నమోదైంది. తనను మాయ చేసి గొలుసు తీసుకుందని,తిరిగి ఇమ్మని అడిగితే బెదిరించిందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: నానా పటేకర్ లాస్ట్ మెసేజ్, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!
సదరు కాంట్రాక్టర్ ఫిర్యాదు ప్రకారం, నడుము నొప్పికి ఫిజియోథెరపీ చేయించుకుంటున్న సమయంలో ఆ కాంట్రాక్టర్‌కు మధుమితతో పరిచయం ఏర్పడింది. 2022లో మధుమిత అతనికి ఫోన్ చేసి తిరునెల్వేలి కోర్టు దగ్గర తనను తీసుకుని బస్ స్టాండ్ వద్ద దింపమని కోరింది. అతను తన కారులో ఆమెను తీసుకెళ్లి దింపిన తర్వాత, తాను మెడలో వేసుకున్న ఐదు సవర్ల గొలుసు కనిపించకపోవడాన్ని గమనించాడు. దాన్ని తిరిగి ఇవ్వాలని మధుమితను అడిగారు దీనికి ఆమె బెదిరించిందని యన ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.


