దిగ్గజ నటుడు నానా పటేకర్ (Vishwanath Nana Patekar) హఠాన్మరణం యావత్ సినీలోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. తీవ్ర గుండెపోటు కారణంగా ఆయను గోవాలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు నిరంతరం సీపీఆర్ (CPR) చేసినప్పటికీ చివరికి అసువులు బాశారు. అయితే ఒక సభలో ఆయన చేసిన చివరి ప్రసంగం వైరల్‌గా మారింది. యాదృచ్చికంగా ఆయన చేసిన ప్రసంగం పలువురి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది.
స్నేహితుడికి చివరి మెసేజ్
అంతేకాదు గోవాలోని తన నివాసంలో మరణించడానికి కొన్ని గంటల ముందు, అంటే గురువారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో నానా తనకు అనారోగ్యంగా ఉన్నట్లు ఒక స్నేహితుడికి సందేశం పంపారట. వెంటనే ఆయన స్పందించిన కేర్‌టేకర్‌తో కలిసి నివసిస్తున్న పటేకర్ అపార్ట్‌మెంట్‌కు పరుగెత్తుకెళ్లినా లాభంలేకపోయింది.
Nana Patekar last video😢 RIP legend💐 https://t.co/7PuM4sKdho
— War Talkz (@WarTalkz) October 8, 2026
పీటీఐ పంచుకున్న ఒక పోస్ట్ ప్రకారం పద్మశ్రీ పురస్కార గ్రహీత నానా పటేకర్ మరణానికి కొద్దిరోజుల ముందు (అక్టోబర్ 4న) ఆయన గోవాలోని డోనా పౌలాలో జరిగిన సామ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్, స్టేట్-1 ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో తెల్లటి కుర్తా, తెల్లటి స్కార్ఫ్ (గమ్చా) ధరించి నిండుగా కనిపించారు. ఈ సందర్బంగా ఆయన గుండెలు ద్రవించేలా మాట్లాడిన మాటలు పలువురి కంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ‘‘ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే, నేను రేపు ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు. ప్రతి వ్యక్తి జీవితంలో చివరికి ఆ దశ వస్తుంది. కానీ అది జరగకముందు, నేను చేయాలనుకున్నది చేయగలనా అని నన్ను నేను ప్రశ్నించుకోవాలి" అని ఆ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి మరాఠీలో వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: నానా పటేకర్‌తో అదే చివరి సంభాషణ
గంభీరమైన స్వరం, తనదైన ప్రత్యేక నటన, నిశ్శబ్దంతోనే విలనిజాన్ని పండించగల సామర్థ్యంలోపాటు, ఉద్వేగభరితమైన డైలాగ్ డెలివరీతో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. సీరియస్, యాక్షన్ పాత్రలతో పాటు 'వెల్కమ్' చిత్రంలో ఆయన పోషించిన 'ఉదయ్ శెట్టి' కామెడీ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గమన్ (1978) ద్వారా హిందీ తెరంగేట్రం చేసిన ఆయన, పరిందా, క్రాంతివీర్, తిరంగ, అబ్ తక్ ఛప్పన్,రాజనీతి, సర్కార్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలకు గాను 2013లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో పాటు, మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు.
#WATCH: Nana Patekar’s Last Appearance at an Event in Panaji The last time veteran actor Nana Patekar participated in an event in Panaji, Goa. #RIPNanaPatekar #NanaPatekar #NanaPatekarDeath #NanaPatekarNoMore #Bollywood #IndianCinema #RIP https://t.co/5OUOdFrrxd
— upuknews (@upuknews1) October 8, 2026
కేవలం నటుడిగానే కాకుండా, నామ్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల రైతులకు సహాయం చేస్తూ, సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన ఎప్పుడూ ముందుండే వారు. ఆయన ఇక లేరన్న వార్త టాలీవుడ్, బాలీవుడ్, మరాఠీ సినీ పరిశ్రమతో పాటు కోట్లాదిమంది అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


