నానా పటేకర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న తుకారం ముండే
విలక్షణ నటుడు నానా పటేకర్ మరణం సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. తన నటనతో పాత్రలకు వన్నె తెచ్చిన ఈ దిగ్గజ నటుడు నేడు తుదిశ్వాస విడిచారు. నటుడిగానే కాదు మానవతావాదిగా కూడా ఖ్యాతికెక్కారు. అన్నదాతలకు అండగా నిలిచి మిగతా నటుల కంటే ఆయన ప్రత్యేకంగా నిలిచారు. అందుకే ఆయన మరణాన్ని అభిమానులు, సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. విలక్షణ నటుడినే కాదు.. గొప్ప మానవతావాదిని కోల్పోయామంటూ నివాళులు అర్పిస్తున్నారు.
నానా పటేకర్ మరణంపై ఐఏఎస్ అధికారి, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారం ముండే సంతాపం ప్రకటించారు. ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు. “ఒక అసాధారణ కళాకారుడినే కాదు, ఒక గొప్ప మానవతావాదిని, ప్రియమైన స్నేహితుడిని నేను కోల్పోయాను. ఆయన ఆప్యాయత, అనురాగం చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ తాకాయి. 8 రోజుల క్రితమే ఆయన నాతో మాట్లాడారు. అదే మా ఇద్దరి చివరి సంభాషణ అవుతుందని నేను ఊహించలేదు. ఆయన నాతో చివరిగా అన్న మాటలు 'బాలా.. నువ్వంటే నాకు ఇష్టం'. ఆ మాటలు జీవితాంతం నాతోనే ఉంటాయి. కొంతమంది జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తారు. మరికొందరు మన జీవితాల్లో తమలో కొంత భాగాన్ని మిగిల్చి వెళ్తారు. నానా అలాంటి వారిలో ఒకరు. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం” అంటూ తుకారం ముండే నివాళులు అర్పించారు.
మంచి మిత్రుడిని కోల్పోయా: అనుపమ్ ఖేర్
నానా పటేకర్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ అన్నారు. భారతీయ సినిమా రంగంలోని అత్యుత్తమ నటుల్లో, మానవతావాదుల్లో ఒకరైన తన స్నేహితుడు నానా పటేకర్ ఇక లేరనే హృదయ విదారక వార్త బాధ కలింగిచిందని పేర్కొన్నారు. నానా పటేకర్ తనకు మంచి మిత్రుడని, ఎంతో నిరాడంబరంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. చాలా నిక్కచ్చిగా ఉండేవారని సూటిగా మాట్లాడేవారని అన్నారు. అత్యంత కష్టమైన విషయాలను కూడా తనదైన శైలిలో చెప్పేవారని తెలిపారు. నానా పటేకర్ తుదిశ్వాస విడిచినా సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలతో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. నానా పటేకర్ కుటుంబానికి, ఆయన అభిమానులకు అనుమప్ ఖేర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: మాధురీపై మనసు పారేసుకున్న నానా పటేకర్!
ఎప్పటికీ గుర్తుంచుకుంటాను: ప్రకాశ్‌రాజ్
నానా పటేకర్‌ను చాలా మిస్ అవుతున్నానని అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ నివాళులు అర్పించారు. ఆయనతో తనుకున్న జ్ఞాపకాలను చిరకాలం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. నా ప్రియమైన నానాజీ.. మీతో గడిపిన క్షణాలు.. సంభాషణలు.. వాదనలు.. మీరు వండిన వంట.. మీరు పంచుకున్న జ్ఞానం... వీటన్నింటినీ ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా జీవిత ప్రయాణంలోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు
ఇదీ చదవండి: నానా పటేకర్ లాస్ట్ మెసేజ్, చివరి ప్రసంగం: కన్నీళ్లు రాక మానవు!


