బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ గుండెపోటుతో కన్నుశారు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన నానాపటేకర్ తన జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూశారు. ఒక సందర్భంలో ఆయన బాలీవుడ్ ‘థక్‌థక్ గర్ల్’ మాధురీ దీక్షిత్‌ను తనవైపు నుంచి ప్రేమించానని తెలిపారు. గతంలో ‘ఆప్ కీ అదాలత్’ అనే కార్యక్రమంలో నానా పటేకర్ తనకు మాధురీపై ఉన్న ప్రేమ గురించి తెలియజేశారు. నానా పటేకర్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన ‘వజూద్’ సినిమా అప్పట్లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నానా పటేకర్ పోషించిన మల్హార్ పాత్ర అందరి అభినందనలు అందుకుంది.
‘వజూద్’ సినిమాలో తనది మాధురిపై వన్‌సైడెడ్ లవ్ అని నానా పటేకర్ చెప్పారు. ‘నా వైపు నుంచి ప్రేమ ఉంది. ఆమె వైపు నుంచి ఉండే అవకాశం లేదు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. మాధురితో ఆ సినిమాలో తాను చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని నానా పాటేకర్ పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో ఆయన మాధురీని ఉద్దేశించి ఓ భావోద్వేగభరిత షాయరీని వినిపించారు. తన హృదయంలో ఆమె స్థానం ఏమిటనేది ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ.. తన హృదయ స్పందన, జీవితం, వెలుగు, తాజాదనం, ఆనందం అన్నీ ఆమెతోనే ముడిపడి ఉన్నట్లుగా ఆ షాయరీలో వర్ణించారు. తన కళ్లలో, జ్ఞాపకాల్లో, కలల్లో ఆమెనే కనిపిస్తుందని పేర్కొన్నారు. తన ప్రతి మాటలో, పగలు-రాత్రిలో, ఉదయం-సాయంత్రంలో ఆమె ఉంటుందని నానా పటేకర్ చెప్పారు. నానా పటేకర్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన చిత్రాల్లో ‘వజూద్’తో పాటు ‘మొహ్రా’ అందరినీ అలరించాయి.
ఇదీ చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు నానా పటేకర్ మృతి..


