Thailand: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి! | 11 Dead As Fire Rips Through Buildings In Thailand | Sakshi
Sakshi News home page

Thailand: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి!

Nov 16 2026 9:34 AM | Updated on Nov 16 2026 9:34 AM

11 Dead As Fire Rips Through Buildings In Thailand

ఫుకెట్‌: థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫుకెట్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. ఫుకెట్‌లోని పటాంగ్ సమీపంలో ఉన్న ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. వాహనాల అద్దె వ్యాపారం నిర్వహించే భవనంలో తెల్లవారుజామున 3.17 గంటల సమయంలో మంటలు ప్రారంభమయ్యాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న పలు భవనాలకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
 

గాయపడిన వారిలో 15 మంది థాయ్ పౌరులు కాగా, మరొకరు మయన్మార్‌కు చెందిన వ్యక్తి. ఈ ప్రమాదంలో పర్యాటకులెవరూ మరణించలేదని, గాయపడలేదని పోలీసులు వెల్లడించారు. ఫుకెట్ పశ్చిమ తీరంలోని ప్రసిద్ధ పటాంగ్ బీచ్ సమీపంలో ఈ భవనం ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నాలుగు నెలల క్రితం బ్యాంకాక్‌లోని ఓ బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది మరణించారు. తాజాగా మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: ఆసియాతో అనుబంధమే భారత్‌కు కీలకం: మోదీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement