టైర్‌ పేలి.. బస్సులో చెలరేగిన మంటలు | Fire In Private Travel Bus In Prakasam District | Sakshi
Sakshi News home page

టైర్‌ పేలి.. బస్సులో చెలరేగిన మంటలు

Nov 10 2026 9:27 AM | Updated on Nov 10 2026 9:29 AM

Fire In Private Travel Bus In Prakasam District

సాక్షి, ప్రకాశం: జిల్లాలో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. వలేటివారిపాలెం మండలంలోని చుండి దగ్గర ఓ ప్రైవేట్‌ బస్సు దగ్ధమైంది. టైరు పేలడంతో ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ వెంటనే అప్రమత్తం కాగా.. ప్రయాణికులను బస్సు కిందకు దింపేశాడు. దీంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన జరిగింది.

కాగా, మూడు రోజుల క్రితం చంద్రగిరిలో ఘోర ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. జాతీయ రహదారిలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. డ్రైవర్‌తో సహా 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతి మీదుగా ఒడిశాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు.. పల్టీలు కొట్టింది.

ఇదీ చదవండి: మంత్రి పదవి ఉంటుందా.. ఊడుతుందా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement