పరిటాల శ్రీరామ్‌కు పరాభవమేనా! | Chilakam Madhusudhan Reddy Likely To Become ZPTC Chairman | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్‌కు పరాభవమేనా!

Nov 10 2026 7:51 AM | Updated on Nov 10 2026 7:51 AM

Chilakam Madhusudhan Reddy Likely To Become ZPTC Chairman

సాక్షి, పుట్టపర్తి: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చవిచూసిన టీడీపీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌కు ‘ప్రాదేశిక’ంలోనూ పరాభవం తప్పదా? సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. ప్రాదేశిక ఎన్నికల్లో గెలిచి జెడ్పీ చైర్మన్‌ పీఠం అధిరోహించాలని ఆశించినప్పటికీ అంతిమ లక్ష్యం నెరవేరడం కష్టమేనా? జెడ్పీటీసీగా గెలిచినా చైర్మన్‌ పీఠం మాత్రం దక్కే అవకాశాలు లేవా?...ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేనకు జెడ్పీ చైర్మన్‌ స్థానం కేటాయించే అవకాశం ఉందని, ఆ పార్టీ తరఫున పుట్టపర్తి జెడ్పీటీసీగా గెలిచిన చిలకం మధుసూదన్‌రెడ్డి చైర్మన్‌ అయ్యే సూచనలు ఉన్నాయన్న చర్చ జోరుగా నడుస్తోంది. 

పరిటాల శ్రీరామ్‌    రాజకీయ అరంగేట్రంలోనే రాప్తాడు నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా మకాం మార్చారు. 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ధర్మవరం సీటును బీజేపీకి కేటాయించారు. బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్‌.. మంత్రివర్గంలో చేరిన తర్వాత పరిటాల శ్రీరామ్‌కు అడుగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. జెడ్పీ చైర్మన్‌ స్థానం ఆశించిన ఆయన..ధర్మవరం నియోజకవర్గ పరిధిలో రెండు జనరల్‌ సీట్లు ఉన్నా.. జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండలాన్ని ఎంచుకున్నారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలో పోటీ చేస్తే సత్యకుమార్‌ అనుచరుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని పరిటాల శ్రీరామ్‌ నల్లచెరువుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అతికష్టమ్మీద గట్టెక్కినా ఆయన మండల స్థాయి నాయకుడి (జెడ్పీటీసీ)గానే మిగిలిపోతారని కూటమి నేతల్లో చర్చ సాగుతోంది. 

జనసేన పార్టీకి జెడ్పీ పీఠం? 
కూటమి పొత్తులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సీటును జనసేనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల ఆరంభం నుంచి టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్‌ జెడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారంటూ ప్రచారం చేశారు. అదే సమయంలో జనసేనకే చైర్మన్‌ పీఠం అప్పజెబుతారని, తనకే పట్టం కడతారని ఆ పార్టీ నేత చిలకం మధుసూదన్‌రెడ్డి జనంలోకి వెళ్లారు.  నల్లచెరువు నుంచి పరిటాల శ్రీరామ్, పుట్టపర్తి నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి విజయం సాధించడంతో ఎవరికి పీఠం దక్కుతుందనే దానిపై కూటమి నేతల్లో భారీ చర్చ నడుస్తోంది. అత్యధికులు మాత్రం చిలకం పేరునే చెబుతున్నారు. 

జెడ్పీటీసీగానే పరిటాల శ్రీరామ్‌! 
కూటమి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి చెందిన అభ్యర్థికి జెడ్పీచైర్మన్‌ సీటు కేటాయిస్తే.. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ జెడ్పీటీసీగానే మిగిలిపోతారు.  పరిటాల శ్రీరామ్‌ అరాచకాలు చూడలేక సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినా జనం ఘోరంగా ఓడించారు. ఆ తర్వాత టీడీపీ ఇన్‌చార్జ్‌గా ధర్మవరం మకాం మార్చినా ఆయన గ్రాఫ్‌ పెంచుకోలేకపోయారు. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత జెడ్పీ చైర్మన్‌ పదవిపై ఆశతో నల్లచెరువుకు వెళ్లినా.. ఆ లక్ష్యం నెరవేరే సూచనలు మాత్రం కనిపించడంలేదు.   

ఇదీ చదవండి: విడాకులు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నాలెజినోవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement