పావగడ: తాలూకాలోని సిద్ధాపుర గ్రామానికి చెందిన రైతు రవీంద్ర పెద్ద కుమారుడు హితేశ్(12) పాముకాటుకు గురై శనివారం రాత్రి మృతి చెందాడు. హితేశ్ దీపావళి పండుగ కోసం బూదిబెట్ట గ్రామంలోని తాత ఇంటికి వచ్చాడు. శనివారం రాత్రి ఇంటి సమీపంలోని పొలంలో పడుకున్నాడు. గాఢనిద్రలో ఉన్న హితేశ్‌ను అర్ధరాత్రి ఓ విష సర్పం కాటేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయంత్రం టపాసులు కాల్చి ఆనందంగా గడిపిన చిన్నారి.. తెల్లవారేలోపు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. హితేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటనపై వైఎన్ హొసకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాముకాటుకు గురై చిన్నారి మృతి
గ్రామంలో విషాదఛాయలు


