హిందూపురం టౌన్: మున్సిపల్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. భారత త్రివర్ణ పతాక నిర్మాణం సరైన నిర్వహణ లేక అపరిశుభ్రంగా తయారు కాగా, అక్కడే మున్సిపల్ చెత్త వాహనాలను ఉంచడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా కొట్నూరు చెరువు కట్ట వద్ద జాతీయ జెండా నిర్మాణం చేపట్టారు. అక్కడ సరైన నిర్వహణ లేకపోవడంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి.. జాతీయ జెండా వద్ద అపరిశుభ్రంగా తయారైంది. దీనికి తోడు మున్సిపల్ చెత్త వాహనాలను అక్కడే ఉంచుతుండడంతో చెత్తాచెదారం జాతీయ జెండాపై పడుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదా.. నిర్వహణ చేతకాకపోతే కనీసం జాతీయ జెండా నిర్మాణాన్ని తొలగించి, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
కొట్నూరు చెరువు వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండా వద్ద అపరిశుభ్రత


