ప్రశాంతి నిలయం: ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత గుజరాతీ నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం వేద పఠనంతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం వేడుకల్లో భాగంగా ‘ది గ్లోరీ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా’ పేరుతో వడోదరా, సూరత్‌కు చెందిన సత్యసాయి స్కూల్ విద్యార్థుల నృత్య రూపకం, జానపద నృత్యప్రదర్శనతోపాటు బాలికలు ‘సాయి తూమ్ కహాన్ హో’ పేరుతో చేసిన నృత్య ప్రదర్శన అలరించింది. అలానే ‘యుగ పరివరవ్తన్’ పేరుతో సూరత్ సాయి యూత్ సభ్యులు చేసిన నాటిక అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
ప్రశాంతి నిలయంలో ఘనంగా గుజరాతీ నూతన సంవత్సర వేడుకలు


