పశ్చిమ గోదావరిలో రోడ్డెక్కిన రైతులు | Major Protest By Farmers In West Godavari District | Sakshi
Sakshi News home page

పశ్చిమ గోదావరిలో రోడ్డెక్కిన రైతులు

Nov 10 2026 5:32 AM | Updated on Nov 10 2026 5:32 AM

Major Protest By Farmers In West Godavari District

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రోడ్డుపై బైఠాయించి అన్నదాతల నిరసన

పెనుగొండ డంపింగ్‌యార్డుతో వెయ్యి ఎకరాలు ముంపునకు గురయ్యాయని ఆందోళన

పెనుగొండ: వెయ్యి ఎకరాలు నీటమునిగి నష్టపోయామంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ రైతులు సోమవారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. నక్కల డ్రెయిన్‌పై డంపింగ్‌యార్డు నిర్వహించడం వల్లే పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపించారు. పెనుగొండ ప్యాలెస్‌ రోడ్డు సెంటర్‌లో సుమారు 300 మంది రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. డంపింగ్‌యార్డుతో నక్కల డ్రెయిన్‌ను పిల్ల కాలువలా మార్చేశారని ఆరోపించారు. గ్రామంలో సేకరించిన చెత్తను వేయడం వల్ల డ్రెయిన్‌ పూడుకుపోతోందని వాపోయారు.

దీనివ్ల కోడవల్లి, ఖండ్రిక అగ్రహారం, పేకేరు, అయితంపూడి, పిట్టల వేమవరం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాలు ముంపుబారిన పడుతున్నాయన్నారు. డంపింగ్‌యార్డును తరలించకపోతే ఏటా ముప్పు తప్పదన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తహసీల్దార్‌ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement