ఈ నెలలో నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: కోర్టు కేసులు తదితర కారణాలతో మొదటి విడతలో ఎన్నికలు జరగని 23 పట్టణ స్థానిక సంస్థలకు వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కసరత్తు చేస్తోంది. కోర్టు కేసుల చిక్కులు వీడడంతో ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది.
రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, మంగళగిరి–తాడేపల్లి నగరాలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ జారీచేసి, డిసెంబరు మొదటి లేదా రెండో వారంలో పోలింగ్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 20వ తేదీ తరువాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికలు జరగనున్న 23 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 24.93 లక్షల మంది ఓటర్లున్నారు.


