గెలుపు కాదు అరాచకం | Chandrababu Lies on Local Body Elections Results | Sakshi
Sakshi News home page

గెలుపు కాదు అరాచకం

Nov 10 2026 5:55 AM | Updated on Nov 10 2026 5:55 AM

Chandrababu Lies on Local Body Elections Results

ప్రజా వ్యతిరేకతకు దౌర్జన్యపు ముసుగు 

ఇదే చంద్రబాబు 94 శాతం స్ట్రైక్‌ రేట్‌ మర్మం

రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదు.. హామీలన్నీ హాంఫట్‌ 

మహిళలకు మొండిచేయి.. నిరుద్యోగులకు వెన్నుపోటు.. రైతులకు అన్యాయం.. ఉద్యోగులకు బకాయిలు 

ప్రజాగ్రహానికి భయపడి ఎన్నికల ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేసిన బాబు 

ప్రత్యర్థుల నామినేషన్ల చించివేత.. ఫోర్జరీ సంతకాలతో దొంగ విత్‌డ్రాలు 

గూండాల దాడులు.. ఏజెంట్ల కిడ్నాప్‌లు.. ఓటర్లకు బెదిరింపులు 

పెట్రోల్‌ బాంబులు.. బూత్‌ల కబ్జాలు.. దొంగ ఓట్లతో ఎన్నికల హైజాక్‌ 

అరాచకాన్ని ముందుండి నడిపించిన పోలీసులు.. అన్నీ తెలిసి ప్రేక్షక పాత్ర వహించిన ఎన్నికల సంఘం

పోలింగ్‌ నుంచి కౌంటింగ్‌ దాకా అక్రమాల పర్వం.. ఓట్ల లెక్కల్లోనూ మాయాజాలం 

ప్రజాతీర్పును తొక్కిపెట్టి.. 94 శాతం గెలుపంటూ బాబు గొప్పలు 

అరాచకాల మధ్యా 76 జెడ్పీటీసీ, 1,728 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం 

ప్రజల మనసులు గెలవలేక.. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేసి గెలిచామంటున్న బాబు

సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించామని చంద్రబాబు చెప్పడం హాస్యా­స్పదంగా మారింది. అసలు ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రజలు ఆయనకు ఓటేస్తా­రని మేధావులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేళ్లలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా అనే ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది. సూపర్‌ సిక్స్‌–సూపర్‌ సెవన్‌ హామీలు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి పేరుతో అక్కచెల్లెమ్మలను మోసం చేశారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేదు, తుపాను పరిహారం లేదు. ఉద్యోగులకు డీఏ లేదు, పీఆర్‌సీ లేదు. బకాయిలు 40­వేల కోట్ల రూపాయలు దాటిపోయాయి. ఆరోగ్యశ్రీ నీరుగారింది.

ఆస్పత్రుల్లో మందుల్లేవు. మెడికల్‌ కాలేజీలు, పోర్టులు, భూములు పప్పుబెల్లాలకు అమ్మకానికి పెట్టారు. ఊరూరా మద్యం, గంజాయి ఏరులై పారుతున్నాయి. నిత్యావసరాల ధరలు నింగినంటాయి. ఇలా ఇంటింటినీ మోసం చేసిన చంద్రబాబు పార్టీకి ప్రజలు ఓట్లు గుమ్మరిస్తారా అనే చర్చ నడుస్తోంది. జనాగ్రహం బ్యాలెట్‌లో పడితే ఏమవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఓటుకు బదులు లాఠీని నమ్ముకున్నారు. పచ్చ­మూ­కలకు కిరాయి గూండాలు, గంజాయి ముఠాలు తోడయ్యా­యి.

నామినేషన్‌ పత్రాలు చింపేశారు. సంతకాలు ఫోర్జరీ చేసి దొంగ విత్‌డ్రాలు చేయించారు. అనేక చోట్ల ప్రత్యర్థులే లేకుండా చేశారు. అర్ధరాత్రి ఏజెంట్లను ఇళ్లలోంచి లాక్కెళ్లారు. పోలింగ్‌ కేంద్రా­ల దగ్గర పెట్రోల్‌ బాంబులు పేల్చారు. కెమెరాలు ఆపేసి బూత్‌లు కబ్జా చేశారు. కౌంటింగ్‌లోనూ ఓట్లను చెల్లనివిగా చూపి గెలుపు లెక్కలు రా­సుకున్నారు. ఎన్నికల సంఘం, పోలీసులు, అధికా­ర యంత్రాంగాన్ని పావులుగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని అడుగడుగునా ఖూనీ చేశారు. ఆ 94 శాతం స్ట్రైక్‌ రేట్‌ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని రాష్ట్రమంతటికీ అర్థమయ్యింది. చంద్రబాబు చాతుర్యాన్ని దేశమంతా నివ్వెరపోయి చూసింది.  

ఇలా దౌర్జన్యంతో దక్కించుకున్న గెలుపునే ప్రజల ఆదరణగా చంద్రబాబు సోమవారం మీడి­యా సమావేశంలో డబ్బా కొట్టుకున్నారు. ఎన్నిక­లు స్వేచ్ఛగా జరిగాయని, డబ్బు ప్రభావమే లేదని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. రాష్ట్రమంతా కళ్లారా చూసిన పచ్చ అరాచకాలకు పసుపు ముసుగేసి అవేవీ ఎవరికీ తెలియదన్నట్లు కళ్లార్పకుండా కమిట్‌మెంట్‌తో అబద్ధా్దలు వల్లెవేశారు. ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చూశారు. బాబు చెప్పిన ఒక్కో అబద్ధానికి వాస్తవాలే సమాధానం.  

బాబు అబద్ధాలు.. అసలు నిజాలు  
అబద్ధం: ప్రజలు మా పాలనను ఆదరించారు 
నిజం: ఆదరించడానికి ఈ రెండున్నరేళ్లలో బాబు చేసిందేమిటి? ఎన్నికలు సజావుగా జరిగితే గెలిచే అవకాశమే లేదన్న భయంతోనే ప్రత్యరి్థని బరిలో లేకుండా చేశారు. 84 జెడ్పీటీసీ, 2 వేలకు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే లేకుండా చేశారు. ఎన్నికలు జరిగిన చోట దౌర్జన్యాలు, బాంబు దాడులు, బూత్‌ల ఆక్రమణ. ఇదా ప్రజల ఆదరణ?  

అబద్ధం: సంక్షేమ పథకాలు అందిస్తున్నాం 
నిజం: సూపర్‌ సిక్స్‌–సూపర్‌ సెవన్‌ హామీలను ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి పేరుతో అక్కచెల్లెమ్మలను నిలువునా మోసం చేశారు. గతంలో ఉన్న పథకాలనూ ఆపేశారు. సున్నా వడ్డీనీ ఎగ్గొట్టారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి హామీ గాల్లో కలిసింది. ఊరూరా మహిళలు బాబును నిలదీస్తున్నారు. మోసపోయిన ఈ వర్గాలు కూటమికి ఓటేశాయంటే నమ్మేదెవరు?  

అబద్ధం: రైతులకు అండగా నిలిచాం 
నిజం: రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. పంటలకు గిట్టుబాటు ధర లేదు. సాంకేతికతతో తుపాన్లను ముందే అంచనా వేశామని గొప్పలు చెప్పుకుంటున్నా అర్నబ్‌ తుపానులో నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ, పల్నాడు రైతులకు దమ్మిడీ సాయం లేదు. గత ప్రభుత్వం పంటల  బీమా అ­మలు చేస్తే దానికి ఎగనామం పెట్టి ఇప్పుడు బీమా ఉందా అని రైతులనే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా నష్టపోయిన అన్నదాత కూటమికి జై కొట్టాడా? 

అబద్ధం: సుపరిపాలన అందిస్తున్నాం 
నిజం: సచివాలయ వ్యవస్థను నిరీ్వర్యం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా లేవు. ఉచిత వైద్యం అందించిన ఆరోగ్యశ్రీని నీరుగార్చారు. ఉద్యోగులకు ఐఆర్‌ లేదు, పీఆర్‌సీ లేదు. ఐదు డీఏలు పెండింగ్‌. వివిధ రూపాల్లో ఉద్యోగులకు రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలు. బకాయిల కోసం ఎదురుచూస్తూ తరచూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులే ఈ పాలనను ఆదరించారంటారా? 

అబద్ధం: ఏపీ బ్రాండ్‌ను సూపర్‌ బ్రాండ్‌గా మార్చాం 
నిజం: రాష్ట్రాన్నే అమ్మకానికి పెట్టారు. 17 మెడికల్‌ కాలేజీలను పప్పుబెల్లాలకు ప్రైవేటుకు కట్టబెడుతున్నారు. పోర్టులు, హార్బర్లలో స్కామ్‌లు. ప్రభుత్వ భూములను ఎకరా రూపాయికే బినామీలకు, కావాల్సిన వారికి ధారాదత్తం. రాజధాని పనుల్లో స్కామ్‌. మట్టి, ఇసుక, లేటరైట్‌ దోపిడీ. ఇదేనా బాబు చెబుతున్న సూపర్‌ బ్రాండ్‌? 

అబద్ధం: జీవన ప్రమాణాల్లో రాష్ట్రం ముందంజ 
నిజం: ఊరూరా, వాడవాడలా మద్యం, గంజాయి ఏరులై పారుతున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. బియ్యం సహా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఒకప్పుడు గౌరవంగా చూసిన ఆంధ్రప్రదేశ్‌ను 
దక్షిణాది బిహార్‌గా మార్చేశారు. ఎందులో రాష్ట్రం ముందంజ?  

అబద్ధం: ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి 
నిజం: రెండున్నరేళ్లలో ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టే స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వలేదు. పరిషత్‌ పోలింగ్‌ రోజే 20 జిల్లాల్లో 170కి పైగా ఘటనలు. 47కు పైగా చోట్ల ఏజెంట్లను బూత్‌ల నుంచి గెంటేశారు. 45కు పైగా చోట్ల తెల్లవారుజామున 3 గంటలకే ఏజెంట్లను ఇళ్లలోంచి లాక్కెళ్లి స్టేషన్లలో కూర్చోబెట్టారు. అనేక చోట్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్‌. పులివెందుల ఎర్రిపల్లెలో పోలింగ్‌ కేంద్రం దగ్గరే పెట్రోల్‌ బాంబులు పేలాయి. సీఎం నియోజకవర్గం కుప్పంలోనే ఓటర్లను ఓటేయకుండా వెనక్కి పంపారు. కౌంటింగ్‌లోనూ అక్రమాలు ఆగలేదు. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట్ల రాత్రికి రాత్రే వందల ఓట్లను చెల్లనివిగా చూపి, చెల్లని ఓట్లను తమ ఖాతాలో వేసుకుని టీడీపీ గెలిచినట్లు లెక్కలు రాసుకున్నారు. 

అబద్ధం: పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు 
నిజం: ఈ ఎన్నికల్లో ఖాకీలు పచ్చ చొక్కాలు తొడుక్కున్నట్టు బరితెగించారు. డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకూ యంత్రాంగమంతా టీడీపీని గెలిపించేందుకే పనిచేసింది. మహిళలనూ వదలకుండా వేధించారు. వేలాది మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్‌ చేశారు. టీడీపీ నేతలపై ఒక్క స్టేషన్‌లోనూ ఒక్క కేసు లేదు. దీన్ని నిష్పక్షపాతం అంటారా? 

అబద్ధం: కడపలో రౌడీ రాజకీయం అంతమైంది 
నిజం: పులివెందులలో బ్యాలెట్‌ పత్రాలు లాక్కుని దొంగ ఓట్లు గుద్దిన వీడియోలు రాష్ట్రమంతా చూసింది. లింగాల మండలం కామసముద్రంలో ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సోదరుడు వంద మందితో బూత్‌ ముందు తిష్ట వేసి ఓటర్లను అడ్డుకున్నారు. ఎంపీ అవినా‹Ùరెడ్డిని పోలీసులు రోడ్డుపైనే ఆపేశారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులనే అరెస్టు చేశారు. రౌడీ రాజకీయం ఎవరిది? 

అబద్ధం: ఎక్కడా డబ్బు ప్రభావం లేదు 
నిజం: రెండున్నరేళ్లలో దోచుకున్న సొమ్మును టీడీపీ నేతలు విచ్చలవిడిగా వెదజల్లారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రత్యేక యంత్రాంగాన్నే ఏర్పాటు చేశారు. ఓటర్‌ స్లిప్పులతో పాటే డబ్బులు పంచారు. కర్ణాటక, తమిళనాడు నుంచి రౌడీలను రప్పించి దొంగ ఓట్లు వేయించారు. చంద్రగిరిలో కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు గుద్దించారు. దొంగ ఓటర్లు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.  

అబద్ధం: వైఎస్సార్‌సీపీ బలం తగ్గింది 
నిజం: ఇంత అరాచకం మధ్య కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు వీరోచితంగా పోరాడాయి. పార్టీ 76 జెడ్పీటీసీ, 1,728 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 39.7 శాతం ఓట్లు వచ్చాయని బా­బు సొంత లెక్కలే చెబుతున్నాయి. 2024లో వ­చి్చంది 40 శాతం. పార్టీ బలం ఇసుమంతైనా తగ్గ­లేదు. బూత్‌లు కబ్జా చేసినా ఈ ఓట్లు చెక్కు చెదరలేదంటే కూటమి పునాదులు కదులుతున్నట్లే. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగి ఉంటే బాబు అడ్రస్‌ గల్లంతయ్యేది. 

అబద్ధం: ఏజెన్సీలో ప్రలోభాలు, మతమారి్పడుల ప్రభావం 
నిజం: గెలిస్తే ఆదరణ, ఓడితే గిరిజనులపై నింద. ఇది గిరిజనుల తీర్పును అవమానించడమే. అక్కడి ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మపరిశీలన చేసుకోకుండా నిందలు వేయడం చంద్రబాబుకే చెల్లింది.  

అబద్ధం: ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగింది 
నిజం: రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం చేష్టలుడిగి చూసింది. తుపాను హెచ్చరికలున్నా తేదీ మార్చలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలనూ బేఖాతర్‌ చేశారు. పోలింగ్‌ కేంద్రాలలో కెమెరాలు లేకపోయినా, వెబ్‌కాస్టింగ్‌ ఆగిపోయినా పట్టించుకున్న నాథుడే లేడు.

బాబు మార్కు స్ట్రైక్‌ రేట్‌ అసలు మర్మం.. 
ఈ కుట్రల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ
1. అభ్యర్థులకు బెదిరింపులు.. బైండోవర్లు..  
2. నాయకుల గృహ నిర్బంధం. 
3. కిరాయి గూండాలు, గంజాయి ముఠాలతో నామినేషన్‌ కేంద్రాల స్వా«దీనం.. 

4. నామినేషన్‌ పత్రాలు లాక్కుని చించేయడం 
5. పచ్చ గుంపులకు పోలీసుల దన్ను 
6. దాడులకు గురైన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పైనే కేసులు 

7. అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ.. నామినేషన్ల తిరస్కరణ. 
8. బలప్రయోగంతో ఉపసంహరణలు 
9. నంబర్‌ పెంచడానికి నకిలీ నామినేషన్లు.. తర్వాత ఉపసంహరణలు.. 
10. అమ్ముడుపోయిన ఆర్వోలు.. పత్రాలు మాయం..  

ఓటమి భయంతోనే ఖూనీ 
చెప్పుకోవడానికి ఒక్క మంచి పని లేదు. ఇంటింటా మోసపోయిన జనం, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పరిహారం అందని రైతులు, భృతి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. ఈ ఆగ్రహం బ్యాలెట్‌లో పడితే ఫలితం ఏమవుతుందో బాబుకు బాగా తెలుసు. అందుకే ఓటర్లను బూత్‌లకు రానివ్వలేదు. ఎన్నికల సంఘాన్ని, పోలీసులను, అధికార యంత్రాంగాన్ని యథేచ్ఛగా వాడుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజల ఓటు హక్కును, పోటీ చేసే హక్కును కాలరాశారు. ఆ వ్యవస్థలపై ప్రజల్లో పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఒకనాడు సేఫ్‌ ఆంధ్రాగా ఉన్న రాష్ట్రం చంద్రబాబు సాగిస్తున్న అరాచకాల కారణంగా నేడు సేవ్‌ ఆంధ్రా అని రోధించాల్సిన దుస్థితికి చేరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement