సీఐఐ సదస్సు ముందు ఇన్సెంటివ్‌ ‘షో’ | Chandrababu govt fails to provide industrial incentives | Sakshi
Sakshi News home page

సీఐఐ సదస్సు ముందు ఇన్సెంటివ్‌ ‘షో’

Nov 10 2026 6:26 AM | Updated on Nov 10 2026 6:26 AM

Chandrababu govt fails to provide industrial incentives

పారిశ్రామిక రాయితీల్లో మరోసారి అరకొర విదిలింపులు

ఇవ్వాల్సింది రూ. 15,000 కోట్లు పైనే.. ఇస్తున్నది రూ. 1,400 కోట్లు లోపే  

సదస్సుకు రెండు రోజుల ముందు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్టు హడావుడి 

ఈసారి కూడా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మొండిచెయ్యే 

ఎస్క్రో ఖాతా ఎక్కడని ప్రశ్నిస్తున్న పారిశ్రామికవేత్తలు 

అంతకు ముందు ప్రభుత్వంలోనూ బకాయిలు పెట్టిన చంద్రబాబు 

వైఎస్‌ జగన్‌ వచ్చాక ఒకేసారి చెల్లించారన్న పారిశ్రామికవేత్తలు

సాక్షి, అమరావతి: అవే జిమ్మిక్కులు.. అవే ఈవెంట్‌ షోలు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయిలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. గతే­డాదిలాగానే ఈసారి కూడా విశాఖ సీఐఐ పెట్టుబడుల సదస్సు ముందు ప్రోత్సాహకాలు విడుదల పేరిట అదే షోను నడిపిస్తోంది. చిన్న పారిశ్రామికవేత్తల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు రూ.15,000 కోట్లకు పైగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1400 కోట్లలోపు మాత్రమే విడుదల చేస్తోంది. అంటే 10 శాతం కూడా లేదు. ప్రచారం మాత్రం ఘనంగ చేసుకుంటోంది. రెండు రోజుల ముందు ఖాతాల్లో వేస్తున్నట్లు హడావుడి చేస్తోంది.

 గతేడాది ఇదే విధంగా సీఐఐ పెట్టుబడుల సదస్సు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.1500 కోట్ల రాయితీలు ఇచ్చేశామంటూ ప్రకటించి, చివరకు రూ.1,030 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈసారి ఇస్తామంటున్న రూ.1,400 కోట్లలో ఎంత మంజూరు చేస్తారో, ఎవరికి ఎంత ఇస్తారో అర్థం కావడంలేదంటూ పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రోత్సాహకాల బకాయిల్లో ప్రతి పారిశ్రామికవేత్తకు 20 శాతానికి మించకుండా ఇచ్చేలా అధికారులు బిల్లులు సీఎఫ్‌ఎంఎంస్‌కు పంపిస్తున్నట్లు తెలిసి, వీరు ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రూ.750 కోట్ల ప్రోత్సాహకాల కోసం అనేక రోజులుగా ధర్నాలు చేస్తున్నా, ప్రభుత్వం మనసు కరగడం లేదు. ఈసారి కూడా ఎస్సీ, ఎస్టీలకు రూ.100 కోట్ల లోపే కేటాయించినట్లు తెలుస్తోంది. 

ఎస్క్రో అకౌంట్‌ ఎక్కడ బాబూ? 
పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు తక్షణం చెల్లించడమే కాకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది ఇన్సెంటివ్‌లు  విడుదల చేస్తామని చంద్రబాబు గతంలో గొప్పగా చెప్పా­రు.  ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్‌ ఏర్పాటు చేసి, యూనిట్‌ నిర్మాణం ప్రారంభించగానే ఆ అకౌంట్‌లో మొత్తం ప్రోత్సాహకాలను వేస్తామంటూ గొప్పగా ప్రచా­రం చేశారు. గతేడాది సీఐఐ సదస్సులో దేశ చరిత్రలో లేని విధంగా రాష్ట్రంలో ఎస్క్రో ఖాతా పెట్టి రాయితీలు ముందుగానే వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 

ఈ ప్రకటన చేసి ఏడాది అవుతున్నా ఇంత వరకు ఒక్క కంపెనీకి ఎస్క్రో అకౌంట్‌ ప్రారంభించి ఒక్క రూపాయి జమ చేసిన పాపాన పోలేదు. గడిచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రోత్సాహకాల బకాయిలు రూ.15,000 కోట్లు దాటిపోతే ఇప్పుడు హాడావిడిగా అరకొరగా విడుదల చేస్తుండటంపై పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు 2014–19 మధ్య కూడా చంద్రబాబు రూ.4,273 కోట్లు బకాయిలు పెట్టారని, ఆ తర్వాత వచ్చిన వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి వాటిన్నింటినీ చెల్లించారని గుర్తు చేసుకుంటున్నారు.

 కోవిడ్‌ వంటి భారీ ఆరి్థక సంక్షోభ సమయంలోనూ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బకాయిలన్నీ ఒక్కసారిగా చెల్లించారని గుర్తు చేసుకుంటున్నారు. 2024 ఎన్నికలప్పుడు ఏ ఏడాది ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇస్తానంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా వేధిస్తున్నారని పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement