private travel bus
-
ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం
-
కన్నీటి కాష్టం.. చితికిన గుండెలు
నిశీధిలో మృత్యువు విసిరిన అగ్నిపాశం.. దావానలమై కబళించింది. నిలువెల్లా దహించింది. కన్నీటి కాష్టాన్ని మిగిల్చింది. గుండెలను చిదిమేసింది. మార్కాపురం బస్సు దహనం ఘటనలో మృతుల కుటుంబాలది ఒక్కొక్కరిదీ ఒక్కోగాథ. బతుకుదెరువు కోసం ఊరికాని ఊరు వెళ్లి తిరుగు పయనంలో సమిథలైన వారి నేపథ్యాన్ని చూస్తే ప్రతి హృదయం కదిలిపోతోంది. పొంగుకొస్తున్న దుఃఖంతో విలవిల్లాడుతోంది. – కనిగిరి రూరల్/పామూరు/మార్కాపురం/ పొదిలి/దరి్శ/కొనకనవిుట్ల/కంభం/ఉదయగిరిపండుగ చేద్దాం.. ఊరికొస్తున్నానని చెప్పి..కనిగిరికి చెందిన దేవెండ్ల రామయ్య (51) 20 ఏళ్ల క్రితం బేల్దారి పనులకు తెలంగాణ రాష్ట్రం నిర్మల్ వెళ్లాడు. ఆయన తల్లి ఉండడంతో ఏటా శ్రీరామనవవిుకి సొంతూరు వస్తాడు. ఈ ఏడాదీ బస్సులో బయలుదేరాడు. బుధవారం మధ్యాహ్నం స్వగ్రామంలో ఉంటున్న అమ్మ వెంకటమ్మతో ఫోన్లో మాట్లాడాడు. వస్తున్నాను. పండగ చేద్దాం అన్నాడు. అంతలోనే ప్రమాదంలో మరణించాడు. కొడుకు మరణ వార్త విని తల్లి కన్నీరుమున్నీరవుతోంది. అమ్మమ్మ కోసం వెనక్కివెళ్లి..ఎగసిపడుతున్న మంటలను దాటుకుని బతుకుజీవుడా అంటూ భర్త చేయిపట్టుకుని బస్సు దిగబోతున్న నిండు గర్భిణి తన అమ్మమ్మ ఆర్తనాదాలు విని చలించిపోయింది. భర్త వద్దని వారిస్తున్నా.. వినకుండా ఆమెను కాపాడేందుకు వెనక్కివెళ్లి ఆమెతోపాటే సజీవదహనమైపోయింది. కనిగిరి మండలం చల్లగిరిగిల గ్రామానికి చెదిన తమ్మిశెట్టి రుక్మిణి, బత్తుల లక్ష్మీ కుమారి వరుసకు అక్కా చెల్లెళ్లు. కనిగిరి పట్టణంలోని కొత్తపేటలో ఉంటూ బతుకు దెరువు కోసం తెలంగాణ రాష్ట్రం బడా బింగల్లో బేల్దారి పని చేసుకుంటున్నారు.లక్ష్మీ కుమారి, ఆమె కుమార్తె మౌనికతోపాటు తమ్మిశెట్టి రుక్మిణి (26), ఆమె భర్త తిరుపాలు, రుక్మిణి అమ్మమ్మ పిచ్చమ్మ (80) కలిసి బస్సులో సొంతూరు బయలుదేరారు. తెల్లవారు జామున బస్సులో మంటలు ఎగిసిపడడంతో మెలకువగానే ఉన్న మౌనిక అందరినీ అప్రమత్తం చేసింది. మౌనిక, ఆమె తల్లి లక్ష్మీకుమారి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. తిరుపాలు భార్య రుక్మిణి చేయి పట్టుకుని బస్సు గేటు వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకున్న పిచ్చమ్మ కేకలు వేయడంతో రుక్మిణి భర్త చేతిని విదిలించుకుని బస్సు లోపలికి వెళ్లింది.మంటలు మరింత ఉద్ధృతం కావడంతో ఇద్దరూ సజీవదహనం అయ్యారు. వారిని కాపాడబోయిన తిరుపాలుకూ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు తరలించారు. రుక్మిణి పెళ్లైన ఐదేళ్ల తర్వాత గర్భిణి అయిందని, డాక్టరుకు చూపించుకుందామని సొంతూరుకు వస్తుండగా ఈ ఘోరం జరిగిపోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొడుకును కాపాడి.. కడతేరిన తల్లి కనిగిరి మండలంలోని మండాదివారిపల్లి గ్రామానికి చెందిన ఉప్పు రమాదేవి (45), భర్త మాల్యాద్రి, కుమారుడు మనోహర్ బేల్దారి పనులు నిమిత్తం తెలంగాణ రాష్ట్రం కోరుట్ల సమీపంలోని రామరాజుపల్లి గ్రామంలో ఉంటున్నారు. రమాదేవి, మనోహర్ శ్రీరామనవమి పండగ కోసం సొంతూరు బయలుదేరారు. తెల్లవారుజామున బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వెనుక సీట్లో కూర్చున్న వీరు బయటకు వచ్చేందుకు యత్నించారు. రమాదేవి కొడుకును కాపాడేందుకు మనోహర్‌ను కిటికీలో నుంచి బయటకు నెట్టింది. దీంతో మనోహర్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. రమాదేవి మాత్రం మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. కళ్లముందే తల్లి అగ్నికి ఆహుతి కావడంతో కొడుకు తల్లడిల్లిపోయాడు. మొక్కు తీర్చుకుందామనుకుంటే.. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్ల మండలం చౌడవరానికి చెందిన పొదిలి మహేంద్ర బేల్దారి పనుల నిమిత్తం తెలంగాణకు వెళ్లాడు. శ్రీరామనవమి పండగకు గ్రామంలో మొక్కు తీర్చుకోవాలని స్నేహితులతో కలిసి బస్సులో బయలుదేరాడు. బస్సు ప్రమాదంలోనే కాలిబూడిదయ్యాడు. మహేంద్రకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేంద్ర మరణించాడని తెలుసుకున్న నాగేశ్వరమ్మ గుండెలవిసేలా విలపిస్తోంది. రిజర్వేషన్ లేకుండానే బయలుదేరి.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా దుత్తలూరు మండలం మందాలనాయుడుపల్లి గ్రామానికి చెందిన చిలకపాటి వెంకటేష్ కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేక ఖాళీగా ఉంటున్నాడు. ఇటీవల పని నిమిత్తం తెలంగాణకు వెళ్లాడు. తిరిగి స్వగ్రామం వచ్చేందుకు రిజర్వేషన్ లేకపోవడంతో బస్సు సిబ్బందితో మాట్లాడి ఎక్కాడు. తాను ఊరికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులతో ఫోన్లో చెప్పాడు. ప్రమాదం తర్వాత అతడి ఫోన్ స్విచాఫ్ రావడంతో తల్లి రత్నమ్మతోపాటు బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ శ్యాంపిల్స్ అందించారు. వాటిని సరిపోల్చగా వెంకటేష్ మరణించినట్టు అధికారులు ప్రకటించారు. వెంకటేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.భర్తకు బదులు వస్తూ.. మృత్యు ఒడికి..కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటూ బతుకు దెరువు కోసం బేల్దారి పనులకు నిర్మల్ వెళ్లిన భర్త దగ్గరికి వెళ్లి.. శ్రీరామ నవమి పండుగకు తిరిగి వస్తూ బస్సు ప్రమాదంలో బండారు పద్మజ మృత్యుఒడికి చేరింది. వీరి స్వగ్రామం వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం. శ్రీరామనవమి పండుగకు కనిగిరి రావాలని భర్త వెంకటరామయ్య రిజర్వేషన్ చేసుకున్నాడు. అయితే పిల్లల్ని చూడాలనిపిస్తోందని పద్మ తానే కనిగిరి వెళ్తానంటూ భర్తకు బదులు ఆ టికెట్‌పై బస్సు ఎక్కింది. సజీవదహనమైంది. ఆమె మరణవార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూ.లక్షతోపాటు అగ్నికి ఆహుతిఉదయగిరి మండలం దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు (45) జగిత్యాలకు బేల్దారీ పనుల కోసం వెళ్లాడు. స్వగ్రామం దాసరిపల్లిలో గతేడాది శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా స్వామి హుండీ నుంచి నగదు తీసుకున్నారు. అందుకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లించేందుకు మేస్త్రి వద్ద రూ.లక్ష నగదు తీసుకుని జగిత్యాల నుంచి దాసరిపల్లికి బస్సులో బయలుదేరాడు. బస్సు ప్రమాదంలో నగదుతోపాటు వెంకటేశ్వర్లు అగ్ని కీలల్లో సజీవంగా దహనమయ్యాడు. వెంకటేశ్వర్లుకు భార్య, పిల్లలు ఉన్నారు. రాముని బ్రహ్మోత్సవాల కోసం.. బుచ్చిరెడ్డిపాళెం పట్టణం పెద్దూరులోని ఇప్పగుంట వారి డొంక కాలనీకి చెందిన కత్తి జయరాములు (55) తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు బేల్దారీ కూలి పనికి వెళ్లారు. ఆయన భార్య బుజ్జమ్మ జనవరిలో అనారోగ్యంతో మరణించింది. వీరికి సంతానం లేదు. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగే కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు బస్సులో బయలుదేరాడు. ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మరణించాడు. కళ్లెదుటే భర్త, ఐదునెలల బిడ్డ సజీవదహనం కళ్లెదుటే భర్త, ఐదునెలల బిడ్డ సజీవదహనం అవుతుంటే ఆ మహిళ గుండెలవిసేలా విలపించింది. మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్లకు చెందిన అంబటి అనిల్ (27) సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్య సౌజన్యతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాడు. వీరికి ఐదునెలల కుమారుడు ఉన్నాడు. గురువారం కుమారుడికి అన్నప్రాశనతోపాటు పేరు పెట్టాలనే ఆలోచనతో బస్సులో స్వగ్రామం బయలుదేరారు. మరో 40 నిమిషాల్లో ఊరులో ఉంటామన్న ఆనందంలో ఉండగానే బస్సులో మంటలు చెలరేగాయి.అనిల్ బిడ్డను భుజాన వేసుకుని భార్యతో దిగేందుకు యత్నించాడు. ముందుగా భార్యను కిందకు నెట్టేశాడు. ఆ తర్వాత పొగ ధాటికి కళ్లు కనిపించకపోవడంతో మంటల్లో చిక్కుకుని బిడ్డతోపాటే సజీవదహనమయ్యాడు. భర్త, బిడ్డ కళ్లెదుటే మంటల్లో కాలిపోతుంటే ఆ ఇల్లాలు నరకయాతన అనుభవించింది. కొడుకును లియో హృదన్ (ఇంకా పేరుపెట్టాల్సి ఉంది) అంటూ గుండెలు బాదుకుంటూ రోదించింది. గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బేల్దారీ పనులకెళ్లి తిరిగి వస్తూ.. కలిగిరి మండలం బొమ్మరాజు చెరువు ఎస్సీ కాలనీకి చెందిన ఆత్మకూరు చిన్నా (45) హైదరాబాద్‌లో బేల్దారీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీరామనవవిుకి జగిత్యాల నుంచి కలిగిరికి బయలుదేరాడు. మంటల్లో చిక్కుకుని మరణించాడు. ఇతనికి భార్యతోపాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.అద్దె ఇల్లు ఖాళీ చేసి వస్తూ తల్లికూతుళ్లు బలిశ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన నర్సింగ శ్రీను, పొదిలి మండలం ఉన్నగురవాయపాలేనికి చెందిన ప్రభావతి (37) భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల పాప చైత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో శ్రీను బేల్దారి మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. శ్రీను ఇటీవల అత్తగారి ఊరిలో పని ఒప్పుకుని ఇక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. జగిత్యాలలో వీరు ఉంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేయడానికి శ్రీను భార్య ప్రభావతి, కూతురు చైత్ర వెళ్లారు. ఖాళీ చేసి బస్సులో వస్తుండగా, ప్రమాదం జరిగింది. మంటల్లో తల్లీకూతుళ్లు ఆహుతయ్యారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న శ్రీను బూడిద కుప్పల్లో మృతదేహాలై ఉన్న తల్లీకూతుళ్లను చూసి గుండెలవిసేలా రోదించాడు. -
తెల్లారిన బతుకులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, నెల్లూరు (టౌన్), కలిగిరి : తెల్లవారుజామున 5.30 గంటల సమయం.. బస్సు మార్కాపురం హైవే మీద దూసుకుపోతోంది. యర్రగొండపాలెం వద్ద స్టీరింగ్ మొరాయించడంతో డ్రైవర్ తాత్కాలికంగా మరమ్మతులు చేసి బస్సును నడుపుతున్నాడు. రాయవరం మెడికల్ కాలేజీ, పలకల గనుల మధ్య కొండ మలుపు తిరుగుతోంది. అదే సమయంలో.. చీమకుర్తి నుంచి కంకర లోడు టిప్పర్ ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో అప్పటికే మరమ్మతులకు గురైన బస్సు స్టీరింగ్ జామ్ కావడంతో అదుపు తప్పింది.. వేగంగా వచ్చి టిప్పర్ మధ్యలో ఉన్న ఆయిల్ ట్యాంకును ఢీ కొట్టింది. దీంతో వెలువడిన మంటలు క్షణాల్లో బస్సును అంటుకున్నాయి. మరోవైపు బస్సులో ఉన్న బ్యాటరీ పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అగ్నికీలల్లో ప్రయాణికులు కాలి బూడిదైపోయారు. పలువురు ప్రాణాలను కాపాడుకునేందుకు బస్సు డోరు, కిటికీ అద్దాలను పగులగొట్టి బయటపడేందుకు ప్రయత్నించారు. 13 మంది సజీవ దహనం కాగా చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. బస్సు నుంచి దూకి 28 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. మాటలకందని ఈ విషాదం అందరినీ కలిచివేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులోని పలక గనుల సమీపంలో గురువారం వేకువ జామున ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కళ్లెదుటే కాలిపోతుంటే..తండ్రి ఎదుటే కుమారుడు... భార్య కళ్లెదుటే భర్త, చిన్నారి.. అగ్ని కీలలకు ఆహుతి కావడంతో బాధితులను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. కళ్లెదుట తమవారు సజీవ దహనమవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో విలవిల్లాడారు. ఘటనా ప్రాంతమంతా హృదయ విదారకంగా మారింది. క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.స్టీరింగ్‌కు తాత్కాలిక మరమ్మతులు చేసి..బస్సు తొలుత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వద్దకు రాగానే స్టీరింగ్ బేరింగ్ చెడిపోయింది. దాంతో బస్సును సుమారు గంటసేపు అక్కడే ఆపి తాత్కాలిక మరమ్మతులు చేశారు. అనంతరం బస్సు రాయవరం పలకల గనులు దాటి కొండ మలుపు వద్దకు రాగానే చీమకుర్తి నుంచి వస్తున్న కంకర లోడు టిప్పర్ ఎదురొచి్చంది. దాంతో బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో అప్పటికే మరమ్మతులకు గురైన స్టీరింగ్ బిగుసుకుపోయి అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ముందే హెచ్చరించిన ప్రయాణికులు..?బస్సు కండీషన్‌పై ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. బస్సు కండీషన్ సరిగా లేదని డ్రైవర్ అంగీకరించినట్లు కొందరు ప్రయాణికులు చెబుతున్నారు. అనంతరం కొద్దిసేపటికే మార్కాపురం సమీపంలో ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల నుంచి కలిగిరికి..ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరికి వెళుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో బయలుదేరింది. జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, నిజామాబాద్, ఆర్మూరు, భీంగల్, కామారెడ్డి, రామాయంపేట, మేడ్చల్‌లో ప్రయాణికులు ఎక్కారు.మొత్తం 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సులో మాచర్లలో ముగ్గురు ప్రయాణికులు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. ట్రావెల్స్ బస్సు అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయింది. యార్లగడ్డ కోటేశ్వరరావు, తండ్రి గణపతిరావు, కొమరోలు, కృష్ణా జిల్లా అడ్రసు పేరుతో ఉంది. బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలియగానే కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం తిప్ప వద్ద ఉన్న ట్రావెల్స్ కార్యాలయాన్ని మూసివేశారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు...ఈ ఘోర ప్రమాదంలో ముక్కు పచ్చలారని 5 నెలల చిన్నారి, ఆరేళ్ల బాలిక, ఐదుగురు మహిళలు, మరో ఏడుగురు పురుషులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. తేరుకునే సమయం కూడా లేకపోవడంతో ఊపిరాడక మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. కాగా, బస్సు డ్రైవరు పందెం యువరాజ్ ప్రమాదం జరిగిన వెంటనే పారిపోతూ పొదల్లో స్పృహ తప్పి పడిపోయాడు. ఉదయం 8.30 గంటలకు స్థానికులు గుర్తించారు.అనంతరం అతన్ని అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. టిప్పర్ యజమాని అశోక్ రెండు నెలల క్రితమే వాహనాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను తొలుత మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 12 మంది క్షతగాత్రులను ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. పూర్తిగా కాలి, ముద్దలుగా మారి...పోలీసులు, అధికారులు ప్రమాద స్థలానికి చేరుకునే లోపే బస్సు కాలి బూడిద కావడంతో ఇనుప కడ్డీలు మాత్రమే మిగిలాయి. బొగ్గులా మారిన మాంసపు ముద్దలు కనిపించాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద 14 మృతదేహాలను వెలికి తీశారు. గుర్తు పట్టలేని విధంగా మసి బొగ్గులా మారిన మృతదేహాలు కంటనీరు పెట్టించాయి. మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. కాగా, బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం విచారం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గురువారం ఆమె ఘటనా స్థలాన్ని పరిశీలించారు.స్పందించని డయల్ 100, 108ప్రమాదం జరిగిన వెంటనే డయల్ 100కు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని ఓ యువతి వాపోయింది. 20 సార్లు ఫోన్ చేసిన తరువాత 108 స్పందించినట్లు పేర్కొంది. బాధితులను పరామర్శించేందుకు మార్కాపురం జీజీహెచ్‌కు వచ్చిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎదుట ఈ విషయాన్ని వెల్లడించి రోదించింది.బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారంమృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియాసాక్షి, న్యూఢిల్లీ: మార్కాపురం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. నా మనసును తీవ్రంగా కలచివేసిందిబస్సు ప్రమాదంపై మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతిసాక్షి, అమరావతి: మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన మనసును తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దారుణ ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడినవారికి ప్రత్యేక వైద్య బృందాలతో అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతోపాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయంపార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిమార్కాపురం: రాయవరం పలకల గనుల వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ఆ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించిన అనంతరం స్థానిక జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘గత ఏడాది అక్టోబరులో కర్నూలులో కూడా ఇలాంటి బస్సు దుర్ఘటనే జరిగింది. మళ్లీ అటువంటి దుర్ఘటన మార్కాపురంలో జరగడం దురదృష్టకరం’’ అని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.మార్కాపురం జీజీహెచ్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజీని ఇక్కడ నిర్మించి ఉంటే నాణ్యమైన వైద్యం అందేదని, ఒంగోలుకు తరలించాల్సిన పరిస్థితి ఉండేది కాదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడే మెడికల్ కాలేజీని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు అన్నా రాంబాబు, దద్దాల నారాయణ యాదవ్ తదితరులు ఉన్నారు.మృతుల వివరాలు1. అంబటి అనిల్ (27) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)2. అంబటి లియో (5 నెలలు) (కొనకనమిట్ల మండలం పెదారికట్ల)3. తమ్మిశెట్టి పిచ్చమ్మ (80) (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)4. తమ్మిశెట్టి రుక్మిణి (26) (కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామం)5. ఉప్పు రమాదేవి (కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి)6. బండారు పద్మ (28) (కనిగిరి)7. దేవేండ్ల రామయ్య (బీసీ కాలనీ, కనిగిరి)8. పొదిలి మహేంద్ర (వెలిగండ్ల మండలం చౌడవరం)9. నర్సింగ్ ప్రభావతి (36) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)10. నర్సింగ్ చైత్ర (6) (పొదిలి మండలం ఉన్నగురవయ్యపాలెం)11. ముత్తంగి వెంకటేశ్వర్లు(45) (ఉదయగిరి మండలం దాసరిపల్లి, నెల్లూరు జిల్లా)12. కత్తి జయరాములు (బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా)13. ఆత్మకూరు చిన్నా (45) (కలిగిరి మండలం బొమ్మరాజుపల్లి, నెల్లూరు జిల్లా)14. చిలకపాటి వెంకటేష్ (కొండాపూర్ మండలం గొట్టిగుండాల, నెల్లూరు జిల్లా)సొంతూళ్లో వేడుకల కోసం బయలుదేరి.. జగిత్యాలక్రైం/రాయికల్/రుద్రంగి: జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ రమణయ్య, ఆయన వద్ద పనిచేస్తున్న మనోహర్, ప్రభావతి, రాయికల్ మండలం అయోధ్యతోపాటు రామారావుపల్లికి వలస వచి్చన ఉప్పు రమాదేవి, రుద్రంగిలో తాపీమేస్రీగా పనిచేస్తున్న దేవండ్ల రామయ్య, దుబ్బాల రత్తమ్మ, అయోధ్యలో మేస్త్రీ వద్ద పనిచేస్తున్న దుబ్బాల కిరణ్, పునుగోటి వెంకటేశ్ శ్రీరామనవమి సందర్భంగా స్వగ్రామాలకు హరికృష్ణ ట్రావెల్స్‌లో బుధవారం సాయంత్రం బయల్దేరారు. వీరిలో ప్రభావతి, రమాదేవి, దేవండ్ల రామయ్య మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. కొడుకును కాపాడి.. తల్లి సజీవదహనం మార్కాపురం జిల్లా కనిగిరి మండలం మాడాదివరిపల్లికి చెందిన ఉప్పు మాలాద్రి భార్య రమాదేవి, కొడుకు మనోహర్‌తో కలిసి ఆరేళ్లుగా రామారావుపల్లిలో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాల కోసం రమాదేవి కుమారుడితో కలిసి బయల్దేరింది. బస్సులో మంటలు చెలరేగగానే.. రమాదేవి కొడుకును బయటకు తోసేసింది. అప్పటికే మంటలు ఎగిసిపడడంతో రమాదేవి కాలిబూడిదైనట్లు మనోహర్ చెప్పాడు. చిట్టీ డబ్బులు కట్టేందుకు.. : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దాసరవెల్లికి చెందిన వెంకటేశ్, కిరణ్ అయోధ్యలో పోలయ్య తాపీమేస్త్రీ వద్ద రెండు నెలలుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా తాము తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించేందుకు పోలయ్య భార్య రత్తమ్మతో కలిసి బయల్దేరారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేష్‌కు భార్య, కుమారుడు, కూతురు సంతానం. రత్తమ్మ, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. ⇒ జరగడానికి 10 నిమిషాల ముందు కుమారుడు వేలుతో ఫోన్లో మాట్లాడాడని, తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచి్చందని కుటుంబసభ్యులు వాపోయారు.మృతుల్లో తండ్రీకొడుకులుకామారెడ్డి క్రైం: మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన అనిల్ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతను భార్య సౌధ, కుమారుడు లియో (5 నెలలు)తో కలిసి మూడు రోజుల క్రితం కామారెడ్డికి బంధువుల ఇంటికి వచ్చారు. కుమారుడు లియోకు కేశఖండనం చేయించాలని స్వగ్రామానికి వెళ్లాలని భావించారు. వారితోపాటు సమీప బంధువులిద్దరితో కలిసి మార్కాపురంకు బుధవారం రాత్రి కామారెడ్డి నుంచి బయలుదేరారు. బస్సులో మంటలు రేగినప్పుడు అనిల్ తన భార్యను కిటికీలోంచి బయటకు తోసివేసినట్లు తెలిసింది. ఆ క్రమంలో కిందపడిపోయిన కుమారుడిని వెతికి తెచ్చేలోపు మంటలు వ్యాపించడంతో ఇద్దరూ చనిపోయారని బంధువులు తెలిపారు. అనిల్, అతని కుమారుడు మృతి చెందారు.ఇంటికి వెళ్తూ.. లక్ష్మణచాంద: ఏపీ ప్రకాశం జిల్లా రామచంద్రపురం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన బండారు వెంకటరమణయ్య, బండారు పద్మ దంపతులు. నాలుగేళ్ల క్రితం, మణి, వెంకట్రావ్ దంపతులు ఆరేళ్ల క్రితం బతుకు దెరువు కోసం నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి వలస వచ్చి తాపీమేస్త్రీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం స్వగ్రామం అంకభూపాలపురం వెళ్లడానికి బండారు పద్మ, మణి, మణి బావ కుమారుడైన రోహాన్ ఆర్మూర్ నుంచి జగిత్యాల వెళ్లి అక్కడి నుంచి ఓ ట్రావెల్ బస్‌లో బయల్దేరారు. బస్సు కంకర టిప్పర్‌ను ఢీకొని మంటలు చేలరేగడంతో పద్మ మంటల్లోనే కాలి బూడిదైంది. మణి, రోహాన్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మణి ప్రస్తుతం కోమాలో ఉంది. తిరుగు ప్రయాణంలోసిరికొండ: బస్సులో ప్రయా ణిస్తున్న వారు ఉపాధి నిమిత్తం నెల రోజుల కిందట నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలకు వచ్చారు. శ్రీరామనవమి ఉత్సవాల కోసం వారు బుధ వారం రాత్రి వారి స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. మార్కాపురం జిల్లా ఎలగండ్ల మండలం చౌడారం గ్రామానికి చెందిన మహేంద్ర, అబ్రహం, ప్రవీన్.. గడ్కోల్ గ్రామంలో రమణయ్య మేస్త్రీ వద్ద పనులకు వచ్చారు. వీరిలో మహేంద్ర(28) చనిపోయాడు.సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్: మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనలో పలువురు మంది మృతి చెందడం.. పలువురు తీవ్ర గాయాలవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు నిర్మల్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాదంలో మృతిచెందిన వారు.. గాయపడిన వారి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఏపీ సీఎస్‌తో మాట్లాడారు. పలువురి సంతాపం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు కోరారు. రోడ్డు ప్రమాదంపై కేంద్రమంత్రులు బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ డా.సి.అంజిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మార్కాపురం బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు వెంటనే తగిన ఆర్థిక సహాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం మనసును కలిచివేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 26, 2026అంతకుముందు బస్సు ప్రమాదంపై పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీపంలోని మెరుగైన ఆసుపత్రులకు తరలించి, ప్రత్యేక వైద్య బృందాలతో చికిత్స అందించాలన్నారు.ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించి, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందని, ఇలాంటి దుర్ఘటనలు ఇకపై జరగకుండా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వైఎస్ జగన్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. -
ట్రావెల్స్ బస్సు బీభత్సం
కొనకనమిట్ల: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల–చినారికట్ల మధ్య శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ బొలేరో వాహనాన్ని, ఆ వెంటనే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు... శుక్రవారం రాత్రి కనిగిరి నుంచి వెదురుకర్రల లోడుతో గిద్దలూరుకు వెళ్తున్న బొలేరో వాహనం చినారికట్ల సమీపంలో మరమ్మతులకు గురైంది. డ్రైవర్ పీరయ్య బొలేరోను రోడ్డు పక్కన నిలిపి వాహనం లోపల నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వాసవి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా విజయవాడ నుంచి కనిగిరి వస్తున్న ఆర్టీసీ బస్‌ను కూడా ఢీకొంది. దీంతో బొలేరో వాహనంలో ఉన్న వెదురు కర్రలు ట్రావెల్స్ బస్సు ముందు భాగంలోకి చొచ్చుకుపోయాయి. రెండు బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు ముందు సీటులో కూర్చున్న వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లెకు చెందిన అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి (54) పొట్టలోకి వెదురు కర్ర చొచ్చుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు బస్సుల డ్రైవర్లతోపాటు మరో 18 మందికి గాయాలయ్యాయి. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కొనకనమిట్ల పోలీసులు కనిగిరి వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. జనార్ధన్‌రెడ్డి మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా, రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో వచి్చన భారీ శబ్దానికి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడి లేచి ఏమైందో తెలియక చీకట్లో తీవ్ర భయాందోళనలకు గురై ఆర్తనాదాలు చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
-
మంటలకు పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
మంటల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుల సజీవ దహనం
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదంపై దాదాపుగా ఓ స్పష్టత వచ్చింది. రాంగ్రూట్లో వచ్చిన కంటెయినర్ లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 17 మంది మరణించగా.. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది ప్రయాణికులతో( డ్రైవర్, క్లీనర్‌తో కలిపి 31 మంది అని) కూడిన బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తుండగా.. బెంగళూరు-హెబ్బులి హైవేపై సిరా-హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం(చిత్రదుర్గ జిల్లా) వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలిబూడిదైంది. తొలుత ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అయితే.. ఈ ఘటన నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, హెల్పర్ సురక్షితంగా బయటపడ్డాడు. వాళ్లు తెలిపిన వివరాల ప్రకారం.. అపోజిట్ రోడ్డులోంచి దూసుకొచ్చిన బస్సు ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగింది. ‘‘డివైడర్‌కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా నేను వెళ్తున్న రోడ్డు పైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమై బస్సును కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించా. కానీ అప్పటికే ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మా బస్సు పక్కనే వెళ్తోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. అయితే ఆ వాహనం ఏంటో నేను చూడలేకపోయా. అతివేగం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుంది’’ అని ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వివరించాడు.ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం సిద్ధరామయ్య.. మంత్రులను, అధికార యంత్రాగాన్ని ఘటనా స్థలానికి తక్షణమే వెళ్లాలని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే ప్రమాదానికి గల కారణంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని అన్నారాయన. ప్రమాదం జరిగిందిలా..చిత్రదుర్గ జిల్లాలోని జాతీయరహదారి-48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్‌కు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ వద్ద ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో రెండు వాహనాలు కాలి బూడిద అయ్యాయి. కంటెయినర్ డ్రైవర్‌తో పాటు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికుల్లో చాలామంది కాలి బూడిదయ్యారు. Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999— Naik Kartik (@mekartiknaik) December 24, 2025 యువకుడి సాహసంతో.. ప్రయాణికుల్లో ఒక యువకుడు సాహసం చేసి బస్సు అద్దాలు పగలకొట్టాడు. దీంతో 9 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. వీళ్లలో కొందరికి గాయాలు కావడంతో చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాలిన గాయాలతో ఉన్న క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.సకాలంలో స్పందించినా.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్ట్ ప్రకారం.. మృతుల్లో చాలామంది గోకర్ణవాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.తప్పిన ఘోరం!అయితే.. ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టి.దర్శహళ్లి నుంచి దండేలికి వెళ్తున్న ఓ టూర్ బస్సు.. ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈక్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే, పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ మేరకు ఆ బస్సు డ్రైవర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. -
బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు
సాక్షి, తిరుపతి జిల్లా: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి శబరిమలైకి వెళ్తున్న బస్సు రైటర్ సత్రం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది భక్తులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. జరిగిన ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా
-
తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, తిరుపతి: జిల్లాలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఒస్సు ఒకటి బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 25 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరుకు వెళ్తోంది. పెళ్లకూరు మండకం దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రి వద్దకు చేరుకుని పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు చెబుతున్నారు. -
కర్నూలు కావేరి బస్సు డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
కర్నూలులో వి కావేరి బస్సు ప్రమాదం కేసు డ్రైవర్ లక్ష్మయ్యను అరెస్ట్ చేసిన పోలీసులు. బస్సు ప్రమాద కేసులో ఏ1గా ఉన్న మిరియాల లక్ష్మయ్య ఏ2 బస్సు యజమాని కోసం పోలీసుల గాలింపు.కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
మార్కాపురం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం–కుంట మధ్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కొట్టాలపల్లి గ్రామ మూల మలుపు తిరగగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయింది.ఆ సమయంలో బస్సులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటనాస్థలాన్ని మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు
పొదలకూరు: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో దిగిపోయారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణానికి సమీపంలోని మర్రిపల్లి వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రయాణికుల కథనం మేరకు.. పొదలకూరు పట్టణంలోని బస్టాండ్ నుంచి సాయి సింధూ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరుకు బయలుదేరింది.రెండు కి.మీ. దూరంలోని మర్రిపల్లి వద్దకు చేరుకునే సరికి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు భయపడి కిందకు దిగేశారు. కొందరు మరో బస్సులో వెళ్లగా, మరికొందరు దగ్గరలోని బంధువుల ఇళ్లకు వెళ్లారు. -
అసలేం జరిగిందంటే? కర్నూల్ SP మాటల్లో..!
-
20 ప్రాణాలు బుగ్గిపాలు
జైసల్మీర్: దాదాపు 57 మంది ప్రయాణికులతో మొదలైన ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణం అత్యంత విషాదాంతంగా ముగిసింది. బస్సు వేగంగా దూసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అంటుకున్న అగ్నికీలలు రెప్పపాటులో బస్సును ఆవహించి అందులోని 20 మంది ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. రాజస్థాన్‌లోని జైసల్మీర్ నగరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జైసల్మీర్–జోధ్‌పూర్ జాతీయరహదారిపై ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు వెనక భాగంలో షాట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడం మొదలైంది.బస్సు అత్యంత వేగంగా వెళ్తుండటంతో గాలులు తోడై మంటలు చెలరేగి వేగంగా బస్సును చుట్టుముట్టాయి. డ్రైవర్ గమనించి బస్సును రహదారిపై ఒక పక్కకు ఆపి అందర్నీ అప్రమత్తంచేసేలోపే 20 మంది ప్రయాణికులు ఆ మంటలకు సజీవ దహనమయ్యారు. 16 మంది ప్రయాణికులకు తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక, ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.మార్గమధ్యంలో ఇతర వాహనాలు, ట్రాఫిక్ అడ్డుతగలకుండా గ్రీన్‌చానల్ ఏర్పాటుచేశారు. జోధ్‌పూర్ ఆస్పత్రిలో గాయపడిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చికిత్స, సహాయ సహకారాలు అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జైసల్మీర్‌కు చేరుకున్నారు.మొత్తంగా కాలిపోయిన బస్సుతొలుత మంగళవారం మధ్యాహ్నం జైసల్మీర్ నుంచి బస్సు జోధ్‌పూర్‌కు బయల్దేరింది. బయల్దేరిన 10 నిమిషాలకే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని పోక్రాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ పురీ మీడియాతో చెప్పారు. వేగంగా వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు గాలుల ధాటికి రెప్పపాటులో మొత్తంగా అంటుకోవడంతో ప్రమాదతీవ్రత భారీస్థాయిలో ఉంది. మంటలకు బస్సు మొత్తం కాలిపోయింది. బస్సులో పడుకుని ప్రయాణించే విభాగం మొత్తం కాలిబూడిదైంది. కొందరి ప్రయాణికుల మృతదేహాలు అగ్నికికాలిపోయి మాంసం ముద్దలుగా మారిపోయాయి.డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాలను కుటుంబసభ్యులు అప్పగించనున్నారు. విషయం తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి తలో రూ. 50,000 అందజేయనున్నారు. ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ హరిబావూ బగాదే సైతం తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గురైన బస్సును కొత్త యజమాని కేవలం ఐదు రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రమాద సమయంలో బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టంగా పొగ వెలువ డుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారా యి. -
ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు ..12మంది సజీవ దహనం?
జైసల్మేర్: రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంగళవారం (అక్టోబర్14)జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు వ్యాపించారు. ఈ దుర్ఘటనలో 10 నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బస్సు ప్రమాద సమయంలో మొత్తం 57మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రైవేట్ ట్రావెల్ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తుండగా మార్గం మధ్యలో బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వేగంగా వ్యాపించిన మంటలు బస్సు మొత్తాన్ని అంటుకున్నాయి. ఈ ఘటనలో భయాందోళనకు గురైన ప్రయాణికులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు హాహాకారాలు చేస్తూ బస్సు నుంచి బయటకు దూకారు. ఆ సమయంలో బస్సులో ఉన్న పలురువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బస్సు నిర్వహణలో లోపం ఉందా? మంటలు ఎలా చెలరేగాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ పెను ప్రమాదం ప్రైవేట్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు నిరంతర తనిఖీలు, తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు అదుపు తప్పి పంట కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో, వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. గుంటూరులోని ఫిరంగిపురం మండలం మేరికపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూరిస్టు బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. కాగా, సదరు బస్సు గుంటూరు నుండి నరసరావుపేట వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది.ఇక, క్షతగాత్రులు అందరూ రాజస్థాన్‌కు చెందిన వారు అని సమాచారం. తీర్థయాత్రలో భాగంగా వీరంతా అన్నవరం వెళ్లి వస్తుండగా బస్సు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
చిత్తూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం
చిత్తూరు, సాక్షి: జిల్లా శివారు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న టిప్పర్‌ను తప్పించబోయి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి.చిత్తూరు శివారులో గంగాసాగరం(Gangasagaram) వద్ద అర్ధరాత్రి 2 గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తచ్చూరు హైవే నిర్మాణ పనుల్లో భాగంగా ఓ టిప్పర్ అక్కడ ఆగి ఉంది. అదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travel Bus).. ఆ టిప్పర్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీ కొట్టి పడిపోయింది. బస్సు తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(Sumit Kumar) ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. వీళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. సీఎంసీ వేలూరు ఆసుపత్రి కి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.గంగసాగరం సమీపంలోని గాజుల పల్లి ఫ్లై ఓవర్ వద్ద టిప్పర్ లారీ వేగంగా ప్రవేట్ బస్సు ఢీ కొట్టడం తో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు తిరుపతి నుంచి మధురైకు వెళ్తోంది. రంగనాధన్ ఇన్ ట్రావెల్స్ బస్సు ఇది. నలుగురు స్పాట్లో చనిపోయారు. విషమంగా ఉన్న ఆరుగురిని చీలాపల్లి సి.ఏం.సి ఆసుపత్రి కు తలించాం. మిగిలిన వారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. :::శ్రీనివాసరావు, చిత్తూరు రూరల్ సీఐ -
టికెట్ రేట్ల విషయంలో ప్రైవేట్ ట్రావేల్స్ నిలువు దోపిడీ చేశారు మామయ్య!
-
బస్సులో వెళ్తుండగా గుండెపోటు.. కనికరించని డ్రైవర్, కండెక్టర్
సాక్షి, చైన్నె: బస్సులో వెళ్తున్న సమయంలో గుండెపోటుకు గురైన ఓ వంట మాస్టరు పట్ల ఆ బస్సు డ్రైవర్, కండెక్టర్ నిర్దయగా వ్యవహరించారు. మార్గం మధ్యలో ఆసుపత్రులు ఉన్నా పట్టించుకోకుండా బలవంతంగా రోడ్డు పక్కన ఓ టీ కొట్టు వద్ద బస్సు ఆపి దించేసి వెళ్లిపోయారు. దీంతో సకాలంలో చికిత్స అందక, సాయం చేసే వారు లేక రోడ్డుపైనే వంట మాస్టర్ గుండె ఆగింది. కాగా ఆ బస్సులోని ఓ ప్రయాణికుడు ఇచ్చిన సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శ్రీవిళ్లిపుత్తూరు నల్ల కుట్రాలం ప్రాంతానికి చెందిన జ్యోతి భాస్కర్(55) వంట మాస్టర్, శంకరన్ కోయిల్‌లోని ఓ హోటల్లో పనిచేస్తాడు. రోజూ శ్రీవిళ్లిపుత్తూరు – శంకరన్ కోయిల్ మధ్య బస్సు ప్రయాణంతో విధులకు వెళ్లేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటిలాగే వేకువజామున ఇంటి నుంచి శంకరన్ కోయిల్‌కు తిరునల్వేలి వైపుగా వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. ఈ మార్గంలో చైన్నె వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు అనధికారికంగా ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్లడం సహజం. కనికరం లేకుండా.. ఈ బస్సులో ప్రయాణించే సమయంలో మార్గం మధ్యలో రాజ పాళయం వద్దకు జ్యోతి భాస్కర్‌కు ఛాతినొప్పి రావడంతో తల్లడిల్లిపోయారు. సమీపంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఉన్నా, డ్రైవర్, కండెక్టర్ మహేశ్, గోపాల్ కనికరించ లేదు. మానవత్వాన్ని మరిచి వ్యవహరించారు. కనీసం ప్రథమచికిత్స కూడా అందించకుండా శంకరన్ కోయిల్‌కు వెళ్లకుండా క్రాస్ రోడ్డులో బస్సును ఆపేశారు. ఛాతి నొప్పితో తల్లడిల్లుతున్న వంట మాస్టర్‌ను బలవంతంగా బస్సు నుంచి దించేశారు. రోడ్డు పక్కగా ఉన్న ఓ టీ దుకాణం వద్ద కూర్చోబెట్టి బస్సును లాగించేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు పెద్దగా ఎవ్వరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. అయితే, బస్సులో ఉన్న ఓ యువకుడు ఎవరినో బలంతంగా కిందకు దించుతుండడాన్ని గుర్తించాడు. అయితే, అతడికి ఛాతినొప్పి విషయం తెలియనట్లుంది. చివరకు ఆ టీ కొట్టు వద్ద గుండె నొప్పితో కొట్టుకుని వంట మాస్టారు మరణించాడు. కాసేపటికి ఈ సమాచారం శంకరన్ కోయిల్ పరిసరాల్లో వ్యాపించింది. ఈ సమాచారం విన్న శంకరన్ కోయిల్ వరకు బస్సులో ప్రయాణించిన ఓ యువకుడి ద్వారా డ్రైవర్, కండెక్టర్ల దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కగా భాస్కర్‌ను వదిలి పెట్టి వెళ్లిన ట్రావెల్స్ బస్సు, కండెక్టర్, డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మానవత్వం మరిచిన ఈ ఇద్దరిన కఠినంగా శిక్షించాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రకాశం జిల్లా మేడిపి వద్ద రోడ్డు ప్రమాదం
కర్నూలు (టౌన్)/త్రిపురాంతకం: ప్రకాశం జిల్లా మేడిపి వద్ద బుధవారం తెల్లవారు జామున ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని ఒకరు మృతిచెందగా మరో 16 మంది గాయపడ్డారు. కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు త్రిపురాంతకం బైపాస్ ఫ్లైఓవర్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. దీంతో అందులో నుంచి మార్కాపురానికి చెందిన భీమిశెట్టి మానస, కడపకు చెందిన శివలక్ష్మి, మరో మహిళ అటుగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కారు. కర్నూలు నుంచి మెప్మా ట్రైనింగ్ కోసం 22 మంది ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో విజయవాడకు వెళ్తున్నారు. ట్రావెల్స్ బస్సు త్రిపురాంతకం మండలం మేడపి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో మార్కాపురం చెందిన భీమిశెట్టి మానస (22) అక్కడికక్కడే మృతిచెందగా, అదే ట్రావెల్స్ బస్సు రెండో డ్రైవర్ రాజేష్ రెండు కాళ్లు విరిగాయి. ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న కర్నూలుకు చెందిన బి. శానవ్, స్రవంతి, వెంకటేశ్వరమ్మ, హేమలతారెడ్డి, రామలక్ష్మి, షఫీ ఉన్నీస, జ్యోతి, శివగంగ, మరో ఏడుగురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుమన్ తన సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను నాలుగు అంబులెన్స్‌ల్లో పల్నాడు జిల్లా వినుకొండ, గుంటూరుకు మెరుగైన వైద్య సేవల కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దర్శి డీఎస్పీ అశోక్‌వర్ధన్, ఆర్ధ్రో అమరనాథ్, ఎంవీఐ మాధవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరామర్శించిన మెప్మా సిటీ మేనేజర్ ప్రమాదం విషయం తెలియగానే కర్నూలు మెప్మా ఆఫీసుకు చెందిన సిటీ మేనేజర్ మురళీ, కమ్యూనిటీ ఆర్గనైజర్లతో కలిసి హుటాహుటిన వినుకొండకు బయలు దేరారు. పీడీ నాగశివలీల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన రీసోర్స్ పర్సన్లు, టీఎల్ఎఫ్ ఆఫీస్ బేరర్లు, జిల్లా మహిళా సమాఖ్యల అధ్యక్షులను ఆయన పరామర్శించారు. -
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం
-
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
విశాఖపట్నం: జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. డ్రైవరు అతి వేగంగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం నుంచి గుంటూరు వెళ్తున్న సాయికృష్ణ ప్రైవేటు ట్రావెల్ బస్సులో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేందుకు పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లిలలో బస్సు ఎక్కారు. బస్సు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో నక్కపల్లి దాటిన తర్వాత కిలోమీటరు దూరంలో మనబానవానిపాలెం రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్లు ప్రయాణికులు తెలిపారు. అనకాపల్లిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న విజయవాడ సమీపంలో గొల్లపూడి గ్రామానికి చెందిన బైపాన రమేష్ (35) బస్సులోనే చిక్కుకుని అక్కడికక్కడే మరణించారు. ఇదే ప్రమాదంలో ఆయన భార్య బైపాన కుమారి, కుమారుడు మోక్షిత్ (ఆరు నెలలు)తోపాటు 14మంది గాయపడ్డారు. బస్సు ముందు భాగంలో కూర్చున్న రమేష్ సీట్లో ఇరుక్కొని అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం వారి ప్రాంతాలకు పంపించారు. ఆరు నెలల మోక్షిత్æ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. సంఘటన స్థలాన్ని నర్సీపట్నం ఏఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా, నక్కపల్లి సీఐ అప్పన్న పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి వివరాలు సేకరించారు. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలివి.. గొర్ల బలరామం (దేవరపల్లి, బొబ్బిలి), ఎ.గణే‹Ùకుమార్ (పార్వతీపురం), ఎస్.వెంకటవరప్రసాద్ (బొబ్బిలి), చిలకంట నరేంద్ర (బెంగళూరు), చంద్ర (బెంగళూరు), అల్లు శాంతారాం (పార్వతీపురం), గొల్ల శిరీష (పార్వతీపురం), ముప్పాల వర్షిత (బొబ్బిలి), మున్నం దేముడమ్మ (పెందుర్తి), ఆకోటి ధరణి (సాలూరు) అల్లు సావత్రిమ్మ (పార్వతీపురం), పి.కోటేశ్వరమ్మ (పార్వతీపురం) -
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్ సీజ్
ఆదిలాబాద్‌టౌన్: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు. వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్ ఆర్టీసీ ఆర్ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్ చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్, డీఎం కల్పన పాల్గొన్నారు. -
బాలానగర్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ప్రధాన రహదారిపై ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. కూకట్పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఐడీపీఎల్ సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపి, ప్రయాణికులను కిందకు దించేశాడు. క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బస్సులో మంటలు చెలరేగడంతో ఆ రహదారిపై కాసేపు మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ప్రమాద సమయంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సురక్షితంగా బయటపడ్డారు. -
కావేరి ట్రావెల్స్ బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం
-
జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం
చిట్యాల: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలిపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. -
బస్సులో పొగలు, కిటికీలో నుంచి దూకేశారు..
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై ఎస్వీకేడీటీ (SVKDT ) ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖపట్నం నుండి విజయవాడకు వస్తున్న బస్సు ప్రసాదంపాడులోని ఎస్వీఆర్ సెంటర్‌కు వచ్చేసరికి బస్సు టైర్ పగిలింది. టైర్ పగిలిన ధాటికి ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. దీనితో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో ఏమి జరిగిందో తెలియక అయోమయంలో బస్సు కిటికీ నుండి కిందకు దూకారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే బస్సు టైర్ పగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సిటీ బస్సును ఢీకొన్న మినీ వ్యాన్ మరోవైపు గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బస్టాండ్ నుంచి బయటకు వస్తున్న సిటీ బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
-
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సింగరాయకొండ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీవీఆర్ ఫ్యాక్టరీ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బెంగుళూరు నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
నల్లగొండ క్రైం: నల్లగొండ సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపాడు. అనంతరం బస్సు ఇంజెన్ వైర్ల షార్ట్ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు యత్నించాడు. ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా వస్తుండటంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక అధికారులు మంటలను చల్లార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
సాక్షి, అమరావతి బ్యూరో: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తాపడడంతో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటన విజయవాడ బీఆర్టీఎస్ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు (ఏఆర్ 02 5665) సోమవారం వేకువజామున 2.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. విజయవాడ ఏలూరు రోడ్డు నుంచి బీఆర్టీఎస్ రహదారిపైకి మలుపు తిరుగుతున్న సమయంలో బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో మొత్తం 20మంది గాయపడ్డారు. వీరిలో 14 మందిని ప్రభుత్వాస్పత్రికి, మిగిలిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అమరా దుర్గాప్రసాద్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదుచేశారు. బయల్దేరిన దగ్గర నుంచి డ్రైవర్ మితిమీరిన వేగంతోనే బస్సును నడిపాడని ప్రయాణికులు ఆరోపించారు. నెమ్మదిగా వెళ్లమని పలుమార్లు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా దూకుడుగానే నడిపినట్లు వారు తెలిపారు. -
ఎల్"బీపీ".. నగర్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జంక్షన్ జనసంద్రంగా మారుతోంది. ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు.. ఇంకోవైపు ఇతర వాహనాలతో ఈ చౌరస్తా కిక్కిరిసిపోతోంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతిరోజు 800–900 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.ఇవికాకుండా మరో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ ప్రాంతమంతా రద్దీగా మారుతోంది. రోజూ సుమారు 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు 150, ఆంధ్రప్రదేశ్ బస్సులు 350, ప్రైవేట్ బస్సులు 400, కార్లు సహా ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వరుస సెలవులు వస్తే చాలు... ఇక్కడ నిల్చొనేందుకు కూడా చోటు దొరకడం లేదు. బస్సు ఆగేదెలా? ఈ చౌరస్తా నుంచి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా... వాటిని నిలిపేందుకు స్థలం కరువైంది. అధికారులు ఎక్కడా బస్‌బేలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే బస్సులను నిలపాల్సి వస్తోంది. ఇక ఇతర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ఇక్కడ అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణంతో రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. విస్తరణేదీ? ఎల్బీనగర్ నాలుగు రహదారులకు జంక్షన్. ఉప్పల్, బెంగళూర్ హైవే, సాగర్ రింగ్‌రోడ్డు, నగరానికి వెళ్లాలన్న ఈ చౌరస్తా దాటాల్సిందే. ఓవైపు రోడ్ల పనులు జరుగుతుండడం, మరోవైపు జంక్షన్ విస్తరించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు కనీసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్లపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోజూ గొడవలే.. ట్రాఫిక్ సమస్యతో ఈ రూట్లో రోజూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఒక్కోసారి ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ఇతర వాహనదారులతో ఘర్షణలకు సైతం దిగుతున్నారు. పక్కపక్కనుంచే వాహనాలు వెళ్లాల్సి రావడం, ఒక దానికి మరోటి వాహనం తగులుతుండడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆగుతుందో? ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బస్సులు ఎక్కడ ఆగేది తెలియడంల లేదు. బస్సు వచ్చిందంటే చాలు అది ఎక్కడికి పోతుందోనని ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బస్టాప్ అనేది లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. – కుమార్, ప్రయాణికుడు రోజూ జంక్షన్ జామ్ ఇలా... బస్సులు 800-900 కార్లు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణికులు 2లక్షలు -
బస్సు బోల్తా, 25 మంది టురిస్ట్లకు గాయాలు
-
విజయనగరంలో బస్సు బోల్తా
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలయ్యాయి. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందినవారు కాశీయాత్ర ముంగించుకుని తిరుగుప్రయాణం అయ్యారు. తోటపల్లి ఎడవకాలువ వద్దకు రాగానే వారి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 20 మంది యాత్రికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గాజువాకకు చెందిన గౌరీశంకర్ ట్రావెల్స్ బస్సుకు ఈ ప్రమాదానికి గురైంది. ఆళ్ళగడ్డలో ఘోర రోడ్డుప్రమాదం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృతి చెందగా.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు విహారయాత్ర చేపడుతుండగా తిరుగుతూ ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. -
పండుగ దోపిడీ!
సంక్రాంతి పండుగ అంటే ప్రైవేట్ ట్రావె ల్స్‌కు పండుగ. ఆర్టీసీకి ఆదాయం మెండుగ అన్నట్లు మారింది.పండుగ సందర్భంగా పది రోజులు సెలవులు దొరకడంతో అందరూ ఊరికి పయనమవ్వాలని ఉత్సాహం చూపుతన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దోపిడీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ కావడం, సీట్లుదొరక్క.. అడిగినంత ఇవ్వకతప్పడం లేదు. సాక్షి కడప :తెలుగువారి పెద్ద పండుగ కోసం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలనుంచి జిల్లా వాసులు తమ సొంతూళ్లకు రానున్నారు. వీరిని దోచుకునేందుకు ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ రంగం సిద్ధం చేసుకున్నాయి. సాధారణ బస్సులను ప్రత్యేక సర్వీసుల పేరుతో టిక్కెట్ ధరపై అదనంగా 50శాతం వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రద్దీ, సమయాన్ని బట్టి ప్రైవేట్ ట్రావెల్స్ టిక్కెట్ ధరను రెండు నుంచి మూడు రెట్లు పెంచాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులే అధికం.. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రంలోనివిజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖతోపాటు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా దాదాపు 25వేలమంది ఉంటారు. పలు ప్రొఫెసనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు 5వేలమంది ఉన్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పుణే, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారు మరో పదివేలమంది, ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పది వేలు, జిల్లాలో ఉపాధి దొరకక బతుకుదెరువు కోసం, ఇతర పనుల నిమిత్తం వెళ్లి నిరుద్యోగులు, కూలీలు మరో 10వేలమంది ఉండొచ్చని అంచనా వీరంతా పండుగకు తమ సొంతూళ్లకు చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రయాణానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముందు జాగ్రత్త, ప్రణాళికతో సిద్ధమైన 30శాతం మందికి మాత్రమే టిక్కెట్లు దొరికాయి. మిగిలిన వారిలో 10 శాతం రైలులో వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మిగిలిన 60 శాతంలో 10శాతం మంది ప్రత్యేక వాహనాల్లో రావడానికి సన్నద్ధమయ్యారు. 50శాతం మంది చేతి చమురును వదిలించుకుంటేనే టిక్కెట్లు దొరికే పరిస్థితి ఏర్పడింది. రెండింతలు అధికంగా చెల్లిస్తేనే ఆర్టీసీ, ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్లను అందిస్తున్నారు. టిక్కెట్లు దొరకడం గగనం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 11వ తేదీనుంచి 17 వరకు ఇదే పరిస్థితి. రూ.500తో చేయాల్సిన ప్రయాణానికి రూ.1000 నుంచి రూ.1300 వరకు వెచ్చించాల్సిందే! అయినా సీట్లు దొరకడం గగనంగా మారింది. దీంతో దూర ప్రాంత ప్రయాణికుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ పలు బస్సులను తిప్పేందుకు సిద్ధమైనా...లోకల్‌గా బస్సుల సమస్య ఏర్పడనుంది. ప్రైవేట్‌కు దీటుగా ఆర్టీసీ.. ప్రైవేట్ ట్రావెల్స్ వారు రెండు రెట్లు పెంచి దోపిడీకి తెర తీసినా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికే ప్రైవేట్ బస్సు వెబ్సైట్లలోనూ ధరలను పెంచి చూపిస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో కనీసం 70శాతం, ఏసీ బస్సుల్లో 100శాతం మేర ధరలు పెంచారు. ప్రైవేట్‌కు తోడు ఆర్టీసీ సైతం ఎక్స్‌ప్రెస్ సాధారణ సర్వీస్‌లను ప్రత్యేక సర్వీస్‌లుగా మార్చి సంక్రాంతి దోపిడీకి సిద్ధమైంది. రైళ్లలో ప్రయాణం కష్టమే.. జిల్లా మీదుగా హైదరాబాద్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి దాదాపు 30రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వీటిన్నింటిలోనూ ఇప్పటికే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ జాబితా ఉంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. యువకులు, విద్యార్థులు జనరల్ బోగీల్లో ప్రయాణించినా, చిన్నారులు, మహిళలు రిజర్వేషన్ లేకుండా ప్రయాణించాలంటే అగచాట్లు తప్పవు. జిల్లాకు సమీపంలో ఉండే గిద్దలూరుకు వచ్చే రైళ్లలోనూ ప్రయాణికులు భారీగా వస్తారు. దాదాపు 20వేలమంది తమ గమ్యస్థానం చేరతారని అంచనా. విమానాల్లోనూ రద్దీ దేశంలోని అన్ని ప్రాంతాలతోపాటు కడప ఎయిర్‌పోర్టు మీదుగా నడిచే విమానాలు రద్దీగా కనిపిస్తున్నాయి. శుక్రవారం నుంచి మరింత రద్దీగా కనిపించే అవకాశం ఉంది. గతంలో పలుమార్లు ట్రూ జెట్ సంస్థ ప్రయాణికులకు టిక్కెట్ రాయితీలో ఆఫర్లు ఇచ్చి...మార్చి వరకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సంక్రాంతికే ఎక్కువ మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా కడప మీదుగా నడిచే విజయవాడ, హైదరాబాదు, చెన్నై విమాన సర్వీసులు కూడా రద్దీగానే సాగిపోతున్నాయి. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాం సంక్రాంతి పండుగకు కడపజోన్ పరిధిలోని వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశాం. జనవరి 11 నుంచి 14వ తేది వరకు 500 బస్సులు తిరుగుతాయి. హైదరాబాదు, విజయవాడ, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. 15వ తేది నుంచి 21వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం 600 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. అవసరమైతే వాటిని పెంచాలని ఆయా డిపో మేనేజర్లకు ఆదేశాలిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ కేవీఆర్కే ప్రసాద్ తెలిపారు. -
ప్రైవేటు బస్సు నుంచి పోగలు
-
బస్సులో రూ.కోటి నగదు స్వాధీనం
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఓ హోటల్ వద్ద ఆగి ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో నుంచి పోలీసులు రూ.కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు 31 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి చెన్నైకి బయలు దేరింది. ప్రయాణికులు భోజనం చేసేందుకు రాత్రి 11:30 ప్రాంతంలో చిట్యాల శివారులోని ఓ హోటల్ వద్ద ఆపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సూళ్లూరుపేటకు చెందిన కూన ప్రభాకర్ తన యజమాని అయ్యప్పరెడ్డికి చెందిన సుమారు రూ.17 లక్షల నగదును తీసుకుని ప్రయాణిస్తున్నాడు. భోజనానికి దిగి వచ్చేసరికి నగదు బ్యాగు కనిపించకపోవడంతో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశాడు. చిట్యాల పోలీసులు బస్సులో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తీసుకువెళుతున్న కోటీ మూడు లక్షల ఎనబై వేల రూపాయలున్న నగదు బాక్స్ లభ్యమైంది. జగ్గయ్యపేటలో జ్యువెలరీ షాపు నిర్వహించే రాయపూడి రాజశేఖర్‌కు చెందిన నగదును తాను వ్యాపార నిమిత్తం చెన్నైకు తీసుకువెళుతున్నట్లు ప్రయాణికుడు సోమశేఖర్ తెలిపారు. దీంతో తగిన ధ్రువీకరణ పత్రాలు లేవని పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, రూ.17 లక్షల నగదు బ్యాగ్ మాత్రం దొరకలేదు. -
ప్రైవేటు ట్రావెల్ బస్సు దగ్ధం
- డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన పెళ్లి బృందం - షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం! - విశాఖ జిల్లాలో ఘటన కశింకోట (అనకాపల్లి): విశాఖ జిల్లా కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద శనివారం ప్రైవేటు ట్రావెల్ బస్సు కాలిపోయింది. కారు, బస్సు డ్రైవర్ల అప్రమత్తతతో 52 మంది సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. నష్టం సుమారు రూ.కోటికి పైగా ఉంటుదని అంచనా. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన బంధు మిత్రులు అనకాపల్లిలో జరిగే వివాహానికి వెళ్లేందుకు కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్కానియా బస్సులో శుక్రవారం రాత్రి బయలుదేరారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో కశింకోట మండలంలోని పరవాడపాలెం గ్రామం వద్ద అమలోద్భవి హోటల్ సమీపానికి వచ్చేసరికి షార్టు సర్క్యూట్ వల్ల బస్సు వెనుక ఉన్న ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని అదే మార్గంలో వస్తున్న ఓ కారు డ్రైవర్ గుర్తించారు. బస్సు డ్రైవర్ కనకాల శ్రీనుకు విషయాన్ని తెలిపి అప్రమత్తం చేశాడు. దీంతో బస్సును నిలిపి తమ వద్ద ఉన్న ఫైర్ డిస్టింగ్ ఫిషర్‌తో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికులను అప్రమత్తం చేసి దింపి వేశారు. దీంతో వారు సురక్షితంగా బయట పడ్డారు. బస్సు మంటల్లో చిక్కుకోవడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు దాదాపు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం వల్ల సుమారు 3 గంటల పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సీఐ రామచంద్రరావు, ఎస్ఐ బి.మధుసూదనరావు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాలిపోయిన బస్సును క్రేన్ల సహాయంతో పక్కకు తొలగించారు. -
మంటలు చెలరేగి బస్సు దగ్ధం
-
మంటలు చెలరేగి బస్సు దగ్ధం
హైదరాబాద్: మంటలు చేలరేగి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన నగరంలోని కుకట్పల్లి ఐడీఎల్ వద్ద ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బస్సుకు ఎవరైనా కావాలనే నిప్పుపెట్టారా.. లేక మరేదైనా కారణాలతో జరిగిందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
-
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం మోజెర్ల స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో బస్సును పక్కకు తీసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ప్రయాణికులను మరో బస్సులో బెంగళూరుకు పంపించారు. -
తప్పిన పెను ముప్పు
కశింకోట : ఉగ్గినపాలెం వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆదివారం క్రేన్లతో వెలికి తీశారు. ఈ బస్సు ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి ఇక్కడ మదుంపై నుంచి రక్షణ గోడను ఢీకొని పంట కాలువలోకి దూసుకుపోయి ఆగింది. ఇది బోల్తా పడినా, టిప్పర్‌ను ఢీకొట్టినా పెద్ద ఎత్తున ప్రాణ హాని జరిగేదని స్థానికులు తెలిపారు. బస్సులోని 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారిని వేరే బస్సులో పంపించారు. ప్రమాదం జరిగిన తీరు పరిశీలిస్తే పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగి ఉంటుందని భావించారు. గాయపడిన బస్సు డ్రైవర్ రాంబాబు అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బస్సు ముందు భాగం దెబ్బతింది. అధిక వేగంతోనే అనర్థాలు జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సులు మితిమీరిన వేగంతో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు విశాఖ నుంచి ఎక్కువగా రాత్రి వేళ బస్సులను నడుపుతున్నారు. ట్రావెల్ బస్సుల మధ్య పోటీ వల్ల త్వరగా గమ్యానికి చేరుకోవ డానికి అతి వేగంగా బస్సులను నడుపుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను సైతం ధిక్కరిస్తున్నారు. రాత్రి వేళ ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉండటంతో అడ్డు అదుపు లేకుండా నడుపుతున్నారు. దీనివల్ల జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహన చోదకులు, పాదచారులకు భద్రత ఉండటం లేదు. ప్రైవేటు వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి రాత్రి వేళ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని, ప్రమాదాలు నివారించాలని స్థానికులు కోరుతున్నారు. -
పొలాల్లోకి దూసుకెళ్లిన వోల్వో బస్సు
విశాఖపట్నం: ట్రాక్టర్‌ను తప్పించబోయిన వోల్వో బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటన విశాఖ జిల్లా కాశీంకోట సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. బస్సులోని దాదాపు 33 మంది ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో స్వస్థలాలకు పంపారు. గాయపడిన డ్రైవర్‌ను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు- ఢీసీఎం ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: హయత్‌నగర్ మండలం వద్ద అంబర్‌పేట్‌లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్, క్లీనర్ మృతిచెందగా, మరో 14మందికి తీవ్రగాయాలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రియాంక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఏపీ 10v 2255) ఎదురుగా వస్తున్న ఢీసీఎంను ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలైన వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
ప్రైవేటుకు పండగే
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: సంక్రాంతి సందర్భంగా జిల్లా నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సుల నిర్వాహకులు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. హైదరాబాద్‌కు ఓల్వో బస్సులో టికెట్ ధర రూ.760 కాగా గత వారం రోజులుగా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌కు టికెట్ రూ.1100 వసూలు చేశారు. శుక్రవారం ప్రయాణికుల రద్దీ అంతగా లేకపోవడంతో రూ.860తో సరిపెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో డిమాండ్‌ను బట్టి రూ.1100 నుంచి రూ.1500 వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే పలు బ స్సుల్లో సీట్లు రిజర్వు అయ్యాయి. బెంగళూరుకు రూ.675 వసూలు చేయాల్సి ఉండగా మూడురోజులుగా రూ.800 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. గత శని, ఆదివారాల్లో ఒక్కో టికెట్‌కు రూ.1300 వసూలు చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. రద్దీని బట్టి రానున్న రెండు రోజుల్లో జిల్లా నుంచి తిరుగు ప్రయాణమ య్యే వారి నుంచి అధిక ధర వ సూ లు చేసేందుకు ప్రైవేటు బస్సుల ని ర్వాహకులు సిద్ధమయ్యారు. ప్రయాణికుల నుంచి అందినకాడికి దండుకుంటూ బస్సులు నడుపుతున్నారు.


